Movies

విష్ణుకి వెరోనికా ఎన్ని కోట్ల బహుమతిని ఇచ్చిందో …!

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు పెళ్లి నాటి ముచ్చట్లలోకి వెళ్తే, ఎపి సీఎం వైఎస్ జగన్ తాతగారైన రాజారెడ్డి చిన్న కుమారుడు సుధాకర్ రెడ్డ్డి,విద్యారెడ్డి దంపతుల కుమార్తె విరానికా తో విష్ణుకి పెళ్లయింది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈమెకు పెదనాన్న అవుతారు. జగన్ ఈమెకు సోదరుడూ అవుతాడు. అమెరికాలోనే పుట్టిపెరిగిన విరానికా వీలున్నప్పుడల్లా హైదరాబాద్ లో తాతగారైన సిసి రెడ్డి దగ్గరకొచ్చి గడిపేది.

విద్యారెడ్డి తండ్రి సిసి రెడ్డికి సిసి పరిశ్రమ వ్యాపారం ఉండేది. ఆ వ్యాపారం విద్యారెడ్డి చూసుకునేవారు. అయితే అప్పుడప్పుడు తల్లికి తోడుగా విరానికా వ్యాపార పనుల్లో పాల్గొనేది. ఇక మంచు విష్ణు సినిమా రంగంలో ఉండడంతో వీరిద్దరికీ ఒకానొక సందర్భంలో పరిచయం ఏర్పడింది. అసలు సినిమా వాళ్ళని పెళ్ళిచేసుకోవాలని విరానికా రెడ్డికి ఇష్టం లేదట. కానీ విష్ణుతో పరిచయం కారణంగా ఆమె మనసు ఇచ్చేసింది.

విష్ణు కూడా ఒకే చెప్పినా, ఇంట్లో చెప్పే ధైర్యం చేయలేదు. కమెడియన్ సునీల్ ద్వారా చెప్పించాలనుకున్నా అతడూ కల్సి రాలేదు. అయితే విషయం తెల్సిన కమెడియన్ బ్రహ్మానందం మొత్తానికి మోహన్ బాబు చెవిన వేసాడు. ఆవిధంగా ఇరువైపులా పెద్దలు ఒప్పుకుని ప్రముఖల సమక్షంలో పెళ్లయింది. కోట్లు ఖర్చు పెట్టి చేసిన వీరి పెళ్ళి వేడుక 76దేశాల్లో ప్రసారం అయింది. విష్ణుకి 2. 50కోట్ల విలువైన డైమండ్ రింగ్ ని బహుమతిగా విరానికా రెడ్డి ఇచ్చింది. ఇక వీరిద్దరికీ కవలపిల్లలు, ఆతర్వాత ఓ పాప,ఓ బాబు పుట్టారు. మంచు కుటుంబంలో ఇమిడిపోయి చాలామంది స్టార్స్ సవాల్ విసురుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."