Movies

మహేష్ కు తెలుగు చదవడం రాయడం రాదు.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ లో కృష్ణ తర్వాత సూపర్ స్టార్ గా నిల్చిన హీరో మహేష్ బాబు నిజంగా టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హీరో. ఎన్నో హిట్స్,బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఇంత పెద్ద తెలుగు స్టార్ కు తెలుగు చదవడం రాదు. కానీ మహేష్ బాబు తెలుగుతో పాటు తమిళంలో కూడా బాగా మాట్లాడగలరు. గత స్పైడర్ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేసినప్పుడు సొంతంగా తన పాత్రకు తమిళంలో డబ్బింగ్ కూడా చెప్పారు. మహేష్ బాబుకు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా వచ్చు. ఎందుకంటే ఆయన పుట్టింది పెరిగిందంతా తమిళనాడు రాజధాని చెన్నైలోనే కదా. పైగా అక్కడే చదువుకున్నాడు.మహేష్ బాబు 1974 ఆగస్టు 9 న సూపర్ స్టార్ కృష్ణ శ్రీమతి ఇందిరాదేవి దంపతులకు మద్రాసులో జన్మించారు. మద్రాసులోనే మహేష్ చదువు పూర్తయ్యింది. పదోతరగతి వరకు చెన్నైలోని సెయింట్ బెడె స్కూల్ లో చదివారు. అక్కడ లయోలా కాలేజీలో కామర్స్ లో ఇంటర్ డిగ్రీ పూర్తిచేశారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు రాకముందు చెన్నైలోనే ఉండేది. హీరో కృష్ణ అక్కడే నివాసముండి సినిమాలు తీసేవాడు. కృష్ణతో పాటు ఆయన భార్య పిల్లలు ఉండడంతో మహేష్ బాల్యమంతా చైన్నైలోనే సాగింది చిన్నతనంలోనే నటనలో ఓనమాలు దిద్దిన మహేష్ బాబు 5 ఏళ్ల వయసులోనే 1979తో రిలీజ్ అయిన ‘నీడ’ సినిమాతో తెలుగులో తెరంగ్రేట్రం చేశాడు. బాల నటుడిగా 7 చిత్రాలు చేశాడు. 1991లో బాలనటుడిగా వచ్చిన బాలచంద్రుడు మూవీ గ్రాండ్ హిట్ అయ్యింది. అప్పుడు డ్యాన్సులు నటనలతో అలరించాడు. కానీ ఆ సమయంలో స్కూలు విద్య చదువుతున్న మహేష్ బాబు చదువులు డిస్ట్ర్రబ్ కావడంతో కృష్ణ గారు సినిమాలకు బ్రేక్ వేసి చదువులు పూర్తి చేయాలని పంపించేశారు. ఆ తర్వాత మహేష్ బాబు సినిమాల్లో నటించలేదు.

ఆ తర్వాత చాలా ఏళ్లకు 1999లో ప్రిన్స్ మహేష్ బాబు రాజకుమారుడు మూవీతో తెలుగులో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరక్క్షన్ లో ఆ మూవీ వచ్చింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.మహేష్ విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగడంతో ఆయన ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు. నటులు కార్తి సూర్య లు కూడా మహేష్ బాబు స్కూల్ మేట్స్. వారు మహేష్ ఒకటే స్కూళ్లో చదివారు. హైదరాబాద్ వచ్చేశాక మహేష్ కు స్నేహితులు తగ్గిపోయారు. అందుకే ఎప్పుడూ చెన్నై వెళ్లిన తన చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వారితో సరదాగా గడుపుతాడట. కానీ తమిళ మీడియంలో చదవడంతో మహేష్ కు తెలుగులో రాయడం రాకుండా పోయింది. అలా డిగ్రీ కామర్స్ చదివిన మహేష్ తండ్రి బాటలో నటుడిగా అవతారం ఎత్తి ఇండస్ట్రీని ఏలుతున్నాడు.