Movies

తోడికోడళ్ళుగా మారిన టాలీవుడ్ స్టార్ సింగర్స్ వాళ్ళు చేసుకున్న అన్నదమ్ములు కూడా టాలీవుడ్ ప్రముఖ నటులే

కౌసల్య కృష్ణమూర్తి ,నక్షత్రం వంటి మూవీస్ లో సపోర్టింగ్ యాక్టర్ గా మంచి నటన ప్రదర్శించిన వర్ధమాన నటుడు జయంత్ వడాలి కి లేటెస్ట్ గా నిశ్చితార్ధం అయింది. అంతేకాదు ఇతడి అన్న కూడా నటుడిగా ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించాడు. అతడి పేరే నందు. ఓ సినిమాలో హీరోగా చేసాడు.

నందు అనగానే సింగర్ గీతా మాధురి గుర్తొస్తుంది. గీతా మాధురి ఇంస్టాగ్రామ్ లో గల ఫ్యాన్ ఫాలోయింగ్, ఆమె అప్ డేట్స్ మరెవ్వరికీ ఉండవు. నందు బ్రదర్ పేరే జయంత్. పిన్ని కొడుకు అన్నమాట. ఇక గీతా మాధురి వదిన అవుతుంది.

ఇక సింగర్ శృతికి జయంత్ తో జరిగిన నిశ్చితార్థంలో నందు ,గీత హాడావిడీ అదిరిపోయింది. గీతా మాధురి,శృతి ఇద్దరూ సింగర్స్ గా సినిమా ప్రొఫెషన్ లైఫ్ లో ముడిపడి ఉండడమే కాదు,పర్సనల్ లైఫ్ లో కూడా తోడికోడళ్ళుగా బలమైన బంధంతో ముడిపడి ఉన్నారు.