Movies

లవర్ బాయ్ గా అనిపించుకుని కెరీర్ క్లోజ్ అయిపోయిన హీరోస్

సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ అనిపించుకుని కొన్ని సినిమాలతో హిట్స్ కొట్టి ఆతర్వాత కేరీర్ ముగించేసుకున్న హీరోలు కొందరున్నారు. 1990దశకంలో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న వినీత్ ప్రేమ దేశం మూవీతో సౌత్ ఇండియాలో కలల రాకుమారుడు అయ్యాడు. సరైన స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయాడు. ప్రేమ దేశం సినిమాలోనే వేసిన అబ్బాస్ కూడా తన పాషన్ తో సూపర్ లవర్ బాయ్ గా ఇమేజ్ కొట్టేసాడు. అతడి హెయిర్ స్టైల్ కి కుర్రాళ్లలో మంచి ఇమేజ్ ఉండేది.

ఐశ్వర్యారాయ్ తో అప్పట్లోనే జోడీ కట్టి జీన్స్ మూవీతో లవర్ బాయ్ గా అందరి హృదయాలను కొల్లగొట్టిన ప్రశాంత్ తర్వాత ఇమేజ్ నిలబెట్టుకోలేక పోయాడు. ప్రస్తుతంక్యారెక్టర్ రోల్స్ కి పరిమితం అయ్యాడు. ఒకప్పుడు వరుస ప్రేమ కథా చిత్రాలతో ఆకట్టుకున్న మాధవన్ ఇప్పుడు సీరియస్ రోల్స్,విలన్ పాత్రలకే పరిమితం అయ్యాడు. నాగ చైతన్యతో కల్సి సవ్యసాచి మూవీలో చివరిగా నటించాడు. రోజా ,బొంబాయి లాంటి మూవీస్ తో యావత్ ఇండియాలోనే మంచి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న అరవింద్ స్వామి ఆతర్వాత ఎందుకో మాయమయ్యాడు. ఇటీవల దృవ మూవీతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి పెద్దయ్యాక నువ్వే కావాలి మూవీతో హీరో గా ఎదిగిన తరుణ్ లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో పేరుతెచ్చుకున్నాడు. హిట్ మూవీస్ తో దూసుకెళ్లి,ఎందరో అమ్మాయిల మనసు కొల్లగొట్టాడు. అయితే కథల ఎంపికలో తేడా కొట్టడం వలన అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయాడు. బొమ్మరిల్లు అలాగే పలు ప్రేమకథా చిత్రాలతో అలరించిన సిద్ధార్ధ్ ప్రస్తుతం హర్రర్ మూవీస్ తో నెట్టుకొస్తున్నారు. తెలుగులో స్ట్రైట్ ఫిలిమ్స్ రావడం లేదు. తమిళ సూపర్ స్టార్ శింబు లవర్ బాయ్ గా, రొమాంటిక్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. అయితే లవ్ ఎఫైర్స్ వార్తల్లో ఉంటూ లవర్ బాయ్ ఇమేజ్ కోల్పోయాడు.