RRR కోసం అలియా భట్ రోజుకి ఎంత పారితోషికం డిమాండ్ చేసిందో తెలుసా?
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా తెరెకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కోసం చాలామంది స్టార్స్ ని సెలెక్ట్ చేసారు. అందులో టాలీవుడ్ ,బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. ముఖ్యంగా అలియా భట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సహజంగా బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకు పోతున్న అలియా దాదాపు 9 కోట్లకు పైగా పారితోషకం చార్జి చేస్తోంది. మరి టాలీవుడ్ కి ఆమె రావాలంటే రేంజ్ మాములుగా ఉండదు. రెమ్యూనరేషన్ విషయంలో తేడాలు వచ్చి చాలా రోజులుగా ఈ సినిమా ఒప్పుకోవాలా వద్దా అని సందిగ్ధంలో కూడా ఉందనే సమయంలో తన సినిమాలో ఆలియా ఉందని రాజమౌళి తేల్చేసాడు.
నిజానికి ఆ మధ్య కూడా అలియా తప్పుకుందనే ప్రచారం జరిగినా కూడా ఉందని మరోసారి చిత్రయూనిట్ కన్ఫర్మ్ చేసారు. రామ్ చరణ్ సరసన అలియా హీరోయిన్ గా జోడీ కడుతోంది. అయితే ఈ సినిమాలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఏకంగా 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. అయితే ఆ సొమ్ము పెద్ద ఎక్కువ కాదని కూడా వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆమె ఇచ్చిన డేట్స్ కేవలం 10 రోజులు మాత్రమే.. అంటే రోజుకు 50 లక్షల పారితోషికం అందుకుంటుంది అలియా.బాలీవుడ్లో ఒక సినిమా కు 10 కోట్లు తీసుకునే ఆలియా అక్కడి కంటే ఎక్కువే చార్జ్ చేస్తోంది. అక్కడ ఒక్కో సినిమా కోసం దాదాపు రెండు నెలలు కాల్షీట్స్ ఇస్తుంది. కానీ ఇక్కడ పది రోజులకే 5 కోట్లు తీసుకుంటుంది. ఈ విషయంలో నిర్మాత దానయ్యకు రాజమౌళి కూడా ఆదేశాలు ఇచ్చాడట.
పారితోషకం ఎక్కువైనా సరే, బాలీవుడ్ మార్కెట్ మన సినిమాకు రావాలి అంటే ఆలియా భట్ ఉండాల్సిందేనంటూ జక్కన్న చెప్పేయడంతో నిర్మాత కూడా మారు మాట్లాడలేదట. దర్శక నిర్మాతలు ఆమె అడిగినంత ఇచ్చి తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. రోజుకు 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు. కానీ రాజమౌళి విజన్ నమ్మి దానయ్య కూడా ఏమీ మాట్లాడటం లేదు. దానికి తోడు ఆలియా భట్ ఇప్పుడు బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ కావడానికి పరుగులు తీస్తుంది. దాంతో ఆమె ఉంటే కచ్చితంగా హిందీలో కూడా ఈ సినిమాకు క్రేజ్ బాగా పెరిగిపోవడం ఖాయం. ఇక అజయ్ దేవ్గన్ కూడా ఉన్నాడు. దాంతో బాలీవుడ్లో ఆర్ఆర్ఆర్ పై క్రేజ్ ఉంది.
