మహేష్ సినిమాలో విలన్గా స్టార్ హీరో… ప్లాన్ అదిరిందిగా
ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ హిట్ టాక్ అందుకుంది. కలెక్షన్స్ బానే వచ్చాయి. అయితే ఆ తర్వాత మహేష్ ఇంతవరకు ఏ కొత్త సినిమా ప్రకటించలేదు. తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. గీత గోవిందంతో అదిరిపోయో హిట్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ నటించడానికి ఒకే చెప్పాడని తెలుస్తోంది. అయితే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ మూవీలో మహేష్ సరసన ఎవరైతే బాగుంటారో అని హీరోయిన్స్ కోసం చిత్రబృందం వెతుకుతోంది. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె ‘సారా అలీ ఖాన్’ ని ఎప్రోచ్ అయ్యారని టాక్. ఆమె నటించబోతుందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది కూడా. కాకపోతే, కీర్తి సురేష్ అని, కియారా అద్వానీ హీరోయిన్ గా తీసుకోబోతున్నారని ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. అయితే మహేష్ కి జోడీ కట్టే హీరోయిన్ గురించి ఇంకా క్లారిటీ లేదు.
సారా అలీ ఖాన్, కీర్తి, కియారాలలో, మహేష్ పక్కన ఎవరు రొమాన్స్ చేయనున్నారో అని ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేగుతోంది. అయితే మహేష్ సరసన సారా అలీ ఖాన్ను ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందట. ఇక మహేష్ బాబు కోసం ఎమోషనల్ గా సాగే ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను పరుశురామ్ సిద్ధంచేశాడట. ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్నారట. ఉపేంద్ర ఈ సినిమాలో విలన్ పాత్రకు బాగుంటాడని దర్శకుడు భావిస్తున్నాడట. ఉపేంద్ర.. త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్గా బానే చేసాడు.ఇక కరోనా మహమ్మారి తగ్గి అన్ని కుదిరితే ఈ సినిమా అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.
