Movies

RRR లో ఈ హీరో లేడట…అవన్నీ రూమర్స్ అట

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం గురించి రోజుకో వార్త సోషల్‌ మీడియాలో వస్తూనే ఉంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి.లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోవడంతో నిర్మాణానంతర కార్యక్రమాలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చిన రాజమౌళి ప్రస్తుతం డబ్బింగ్‌ చెప్పించే పనిలో ఉన్నాడట.ఈ సమయంలోనే ఈ సినిమాలో కీలక పాత్రలో నవదీప్‌ కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నవదీప్‌ విలన్‌గా కనిపించబోతున్నాడు.అందుకే సిక్స్‌ ప్యాక్‌ బాడీని ఆయన తయారు చేశాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో నవదీప్‌ స్వయంగా స్పందించాడు. తాను ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదన్నాడు.తనను ఆ సినిమా కోసం ఎవరు సంప్రదించలేదని, జక్కన్న సినిమాలో నటించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.

అలాగే నేను కూడా ఆ సినిమాలో నటించాలని కోరుకుంటాను.కాని నాకు ఆ అవకాశం రాలేదన్నాడు.హీరోగా పలు చిత్రాల్లో నటించిన ఈయన సక్సెస్‌లు లేకపోవడంతో బుల్లి తెరపై కూడా కనిపిస్తున్నాడు.ఇటీవలే మస్తీస్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించిన ఈయన నాగబాబుతో కలిసి అదిరింది కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు.సన్నీలియోన్‌తో కూడా ఈయన ఒక వెబ్‌ సిరీస్‌లో నటించడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."