Movies

తీరిన చిరు ‘చిరు’ కోరిక గూర్చి చెప్పిన గొల్లపూడి

తీరిన చిరు ‘చిరు’ కోరిక గూర్చి చెప్పిన గొల్లపూడి. ఒక ఇంటర్వ్యూ లో గొల్లపూడి వెల్లడించిన విషయం ఇది. కోడి రామకృష్ణ దర్శకత్వం లో  ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా లో హీరో గా చిరంజీవి, విలన్ గా గొల్లపూడి మారుతీరావు కలసి నటించారు. అపుడే చిరంజీవి హీరో గా ఎదుగుతున్న రోజులవి. ఆ సినిమా షూటింగ్ సమయం లో గొల్లపూడి తో చనువు ఏర్పడింది చిరంజీవికి. కథా రచయిత గా పరిణతి చెందిన వ్యక్తి గొల్లపూడి పట్ల గౌరవ భావం చూపేవాడు చిరంజీవి. అపుడు తన మనసు లోని కాంక్షను గొల్లపూడి కి చెప్పుకున్నాడు చిరు. అదేమిటంటే అప్పటిదాకా నటించిన సినిమా షూటింగ్ ల్లో కాస్త పేరున్న నటుల ఆటోగ్రాఫ్ ల కోసం జనం ఎగబడేవారు. అపుడు చిరంజీవికి తనకు పేరు ఎపుడు వస్తుందో, తన ఆటోగ్రాఫ్ కోసం జనాలు ఎపుడు వస్తారో అని అనుకునేవాడు. అది కాస్తా సినిమా సినిమా కు బలీయమైన కాంక్ష అయింది. తనకున్న ఆ కాంక్షను గొల్లపూడి కు వెళ్లబోసుకున్నారు చిరంజీవి. అపుడు గొల్లపూడి, చిరు తో నీలో పైకి ఎదిగే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, త్వరలోనే నీ కోరిక తీరుతుంది అని అన్నారు. ఆ సినిమా షూటింగ్  గోదావరి జిల్లాల్లో  జరిగే టైం కు అంతకు ముందు సినిమాల వలన చిరంజీవి జనాలకు తెలియడం, షూటింగ్ చూడడానికి వచ్చిన గోదావరి జిల్లాల ప్రజలు చిరంజీవి ఆటోగ్రాఫ్ కోసం ఎగబడడం జరిగింది. ఇలా ఆటోగ్రాఫ్ కోసం తన మీద ఎగబడడం చిరంజీవి చాలా ఆనందంగా గొల్లపూడి కు చెప్పుకున్నాడు. ఆ తరువాత తరువాత ఒక అభిమాని తన బొటన వేలు కోసుకుని తనకు నేత్హురు తిలకం దిద్దడం గూర్చి వింతగా ఉద్వేగంగా చెప్పుకున్నాడు చిరంజీవి , గొల్లపూడి కు. 

 

ఆ తరువాత ఒకానొక సందర్భం లో చిరంజీవి కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. తన ఆటోగ్రాఫ్ కోసం జనం ఎగబడాలన్న కాంక్ష తీవ్రమై, తనను నటుడిగా, హీరో గా ఎదిగేలా చేసిందని తెలిపాడు.