Movies

నెట్ ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతున్న విజయ్ డిజాస్టర్.!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశి ఖన్నా,ఐశ్వర్య రాజేష్,క్యాథెరిన్ మరియు ఇజబెల్ ఎలైట్ మొత్తం నలుగురు హీరోయిన్ లతో తీసిన ఈ చిత్రం విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం అదరగొడుతుంది. ఇటీవలే ఈ చిత్రం సన్ నెక్స్ట్ మరియు నెట్ ఫ్లిక్స్ లలోకి వచ్చాయి.

అయితే నెట్ ఫ్లిక్స్ లో మాత్రం ఈ సినిమా దుమ్మరు రేపుతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్ లో ఓవరాల్ ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వడమే కాకుండా ఇప్పటి వరకు 60 లక్షలకు పైగా ఇంప్రెషన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అసలు బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం సత్తా చాటని ఈ చిత్రం డిజిటల్ గా ఈ రేంజ్ లో అదరగొట్టం ఊహించనిది అని చెప్పాలి. దీనిని బట్టి విజయ్ తర్వాత పాన్ ఇండియన్ సినిమాకు ఎలాంటి డోకా లేదని చెప్పొచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."