Movies

లాక్‌డౌన్ తర్వాత హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా?

కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ లోకి వెళ్లడంతో చాలా సినిమాలు వాయిదా పడిపోయాయి. కొన్ని కరోనాకు బలైపోయాయి. విడుదలకు సిద్ధమై వాయిదాపడిన సినిమాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేమన్న మాట వినిపిస్తోంది. ఒక్కసారి లాక్ డౌన్ అయిపోతే కచ్చితంగా సినిమాలన్నీ ఒకేసారి బాక్సాఫీస్‌పై పడతాయి. థియేటర్స్ కోసం హీరోలంతా ఫైటింగ్ కూడా చేస్తారని చెప్పాలి. మరో ఆర్నెళ్ల వరకు ఈ ప్రభావం ఉంటుంది.. మరో ఏడాది వరకు నష్టాలు కంటిన్యూ అవుతాయని అంటున్నారు. ఇక పెద్ద సినిమాలు అయితే ఓకే కానీ చిన్న సినిమాలు విడుదల కావడం కష్టమే. ఎందుకంటే చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకవని విశ్లేషిస్తున్నారు.

అందుకే రాబోయే రోజులు మరింత గడ్డుగా మారనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ సెలవుల్లో కూడా కోత పడనుంది. లాక్ డౌన్ లో వచ్చిన నష్టాలను భరించడానికి సెలవులకు ప్రభుత్వం కోత పెడుతుందనే వార్తలు వస్తున్నాయి.అదేనిజమైతే దసరా సీజన్ కూడా తగ్గిపోతుంది. ఇప్పటికే సమ్మర్ సీజన్ అంతా కరోనాకు బలైపోయింది. ఎప్పుడూ వరస సినిమాలతో కళకళలాడుతూ ఉండే సమ్మర్ సీజన్.. ఈ సారి మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. వచ్చే ఛాన్స్ లేనేలేదు. ఇక రాబోయే మూన్నెళ్ల వరకు కూడా కొత్త సినిమాల విడుదల తేదీలు ఉండకపోవచ్చు.

ఇప్పటికే నాని ‘వి’; అనుష్క ‘నిశ్శబ్ధం’; సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటరూ’; వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’; పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లాంటి సినిమాలు వాయిదాపడ్డాయి. దాంతో పాటే నాగ చైతన్య లవ్ స్టోరీ; అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్; నాగార్జున వైల్డ్ డాగ్; వెంకటేష్ నారప్ప;. బాలయ్య- బోయపాటి సినిమా.. చిరంజీవి ఆచార్య కూడా విడుదల తేదీలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆచార్య సినిమా 2020 నుంచి విత్ డ్రా అయినట్లే. 2021 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్. మరోవైపు బాలయ్య బోయపాటి సినిమా కూడా డిసెంబర్‌కు వాయిదా పడేలా ఉందంటున్నారు.