Movies

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి…విషాదంలో సినీ పరిశ్రమ

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) కన్నుమూశారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇర్ఫాన్ కన్నుమూతతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.

ఇర్ఫాన్‌కు 2011లో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఒకసారి జాతీయ పురస్కారం, 4 సార్లు ఫిలింపేర్ అవార్డులు దక్కాయి. ఇర్ఫాన్ తల్లి సైదా బేగం మూడు రోజుల క్రితం చనిపోయారు. జైపూర్‌లో తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరుకాలేకపోయారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."