Movies

ఒక డైరెక్టర్ ఆ విషయంలో బలవంతపెట్టాడని అంటున్నసాయి పల్లవి

ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ సాయి పల్లవి, ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసబెట్టి సినిమాలు చేస్తోంది.ఫిదా సినిమాతో అమ్మడు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందేఈ సినిమా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ అలరించడంతో సాయి పల్లవి వెనక్కి తిరిగి చూడలేదు.కాగా తనను ఓ దర్శకుడు ఒక విషయంలో బలవంతం చేశాడంటూ తన పాత జ్ఞాపకాలను ఇటీవల గుర్తుకు చేసుకుంది ఈ బ్యూటీ.

తన తొలి తెలుగు చిత్రం ఫిదా సినిమా షూటింగ్ సమయంలో తనను స్లీవ్‌లెస్ డ్రెస్ వేసుకునేందుకు దర్శకుడుశేఖర్ కమ్ముల తనను బలవంత పెట్టాడని ఆమె చెప్పుకొచ్చింది.అందాల ఆరబోతకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే సాయి పల్లవి స్లీవ్‌లెస్ స్కర్ట్ వేసుకునేందుకు తొలుత ఇష్టపడలేదట.కానీ సినిమాలో ఒక సీన్ చాలా ముఖ్యమైనదని, ఆమె ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనంటూ శేఖర్ కమ్ముల ఆమెను ఫోర్స్ చేశాడట.

అలాంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు సెట్స్‌లో అందరూ ఎలా చూస్తారో తనకు తెలుసని, అందుకే ఇకపై అలాంటి డ్రెస్సులు వేసుకోనని ఫిదా సినిమా సమయంలోనే నిర్ణయం తీసుకుందట ఈ బ్యూటీ.కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్‌స్టోరి చిత్రంలో నటిస్తుండగా రానా దగ్గుబాటి సరసన విరాటపర్వం చిత్రంలో కూడా నటిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."