Movies

జబర్దస్త్ నవీన్ వయసు ఎంతో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు

పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జబర్దస్త్ నవీన్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. గడ్డం నవీన్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. ఇలా రెండు పేర్లతో కూడా ఈ నటుడు పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా అదిరే అభి స్కిట్స్‌లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అందులో అభి, రాముతో పాటు ఈయన కూడా మంచి కామెడీ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా జూనియర్ రాఘవేంద్రరావుగా మనోడికి మంచి పేరుంది. దాంతో పాటు సినిమాలు కూడా బానే చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఇతడి కెరీర్ బాగానే వెళ్తుంది.

ఈ నటుడు వాటం.. తెల్లగడ్డం చూసాక వయసు చాలా ఎక్కువగా ఉంటుంది.. ఎప్పుడో 30 ఏళ్ల కిందే ఇండస్ట్రీకి వచ్చుంటాడు.. వయసు కూడా 60కి చేరువలో ఉంటుంది ఇలా రకరకాలుగా అనుకుంటారు. కానీ జబర్దస్త్ నవీన్ వయసు తెలిస్తే మాత్రం నిజంగానే షాకవుతారు. మనోడు కనీసం 45 కూడా దాటలేదంటే నమ్మడం కాస్త కష్టమే అయినా సరే, ఇది నిజం. 2020కి నవీన్ వయసు 43 మాత్రమే. మరి లుక్ చూస్తుంటే మాత్రం 60లా ఉంటాడు. 1997లో ఇండస్ట్రీకి వచ్చిన ఈ నటుడు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించాడు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నటించానని.. ఆది, నాగ లాంటి సినిమాల్లో చేసానని గుర్తు చేసుకున్నాడు.

అప్పట్లో ఫుల్ జుట్టుతో, సూపర్ హెయిర్ స్టైల్‌తో నిజంగానే నవీన్ హీరోలా ఉన్నాడు. ఆ లుక్ ఉన్నపుడు ఇతడిని ఎవరూ పెద్దగా గుర్తు పట్టలేదు. కానీ చాలా తక్కువ సమయంలోనే ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయానని కామెడీగా చెబుతున్నాడు. జుట్టు పోయింది, అవకాశాలు రావడం లేదనే బాధతో గడ్డం పెంచానని, అప్పుడు ఛాన్స్ లు రావడం మొదలుపెట్టాయని చెప్పుకొచ్చాడు. తన తెల్లగడ్డం చూసి అందరూ రిటైర్మెంట్ వయసుకు వచ్చేసాడని అనుకుంటున్నారని.. కనీసం తనకు 45 కూడా లేవని చెప్పుకొచ్చాడు. తాతలా కనిపించే నవీన్ వయసు కేవలం 43 మాత్రమే అని చెబితే కొంచెం నమ్మడం కష్టమే కానీ నిజమే కదా.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."