Movies

యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఇస్మార్ట్ అప్పారావ్ జోడి.!

స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ అదే ఛానెల్ లో ప్లాన్ చేసిన మరో గ్రాండ్ రియాలిటీ గేమ్ షో “ఇస్మార్ట్ జోడి”. తెలుగు బుల్లితెర సెన్సేషనల్ యాంకర్ ఓంకార్ ప్లాన్ చేసిన ఈ షో లాక్ డౌన్ విధించిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు కొత్త కంటెంట్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించింది. కానీ తర్వాత షూటింగ్స్ నిలిచిపోవడంతో ఆ జోడిలతో ఓంకార్ మరో కొత్త ప్రయోగం చేసారు.

అదే వారి కంటెస్టెంట్స్ తో తమ ఇళ్లను చూపిస్తూ ఓకే హోమ్ టూర్ లాంటి వీడియోను తీసి వాటిని టెలికాస్ట్ చేస్తున్నారు. అలా జబర్దస్త్ ఫేమ్ అప్పారావు హోమ్ టూర్ వీడియోను వదలగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ వీడియో యూట్యూబ్ టాప్ 2 స్థానంలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ వస్తుంది. ఇప్పటికే వీరి జంట అంటే మంచి ఇంప్రెషన్ స్టార్ మా వీక్షకులలో ఉంది ఈ స్థాయి రెస్పాన్స్ రావడానికి అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."