MoviesTollywood news in telugu

ఎన్‌టి‌ఆర్ తొలి పారితోషికం ఎంతో తెలుసా…ఏమి చేశాడో తెలుసా?

Ntr First remuneration :నందమూరి నటవంశంలో మరో ధ్రువతారగా జూనియర్ ఎన్టీఆర్ ఎంటర్ అయ్యాడు. కేవలం 17 ఏళ్ల వయసులోనే తారక్ హీరో అయిపోయాడు. తాత పోలికలున్నాయంటూ అప్పటికే మంచి గుర్తింపు, ఫాలోయింగ్ కూడా వచ్చేసాయి. ఓటు హక్కు కూడా రాలేదు. మూతిమీద మీసాలు కూడా లేని టైమ్‌లోనే ఇండస్ట్రీ రికార్డుల ను క్రియేట్ చేసాడు.

తొలిసినిమా తర్వాత రెండేళ్లలోనే స్టూడెంట్ నెం 1, ఆది, సింహాద్రి వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఈయన ఒక్కో సినిమాకు కనీసం 30 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు. ఇక తాజాగా జరుగుతున్న పుట్టినరోజు వేళ తొలి సినిమా సంగతుల గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. మొదటి సినిమాకు ఆయన అందుకున్న పారితోషికం గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. అప్పటికే బాల రామాయణం సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు.
Ntr Watch price
గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అవార్డులతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. ఇక మూడేళ్లు గ్యాప్ తీసుకుని 2001లో నిన్ను చూడాలని సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా పరిచయం అయ్యాడు. విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయినా, గుర్తింపు మాత్రం బాగానే వచ్చింది. ఈ సినిమాను ఉషా కిరణ్ మూవీస్ నిర్మించింది. ఈ సినిమాలో నటించినందుకు తారక్ 4 లక్షల రెమ్యూనరేషన్ రామోజీరావు నుంచి అందుకున్నాడు అప్పటికి అది ఎక్కువే.. ఓటు హక్కు కూడా రాని ఎన్టీఆర్ ఆ 4 లక్షలతో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అందుకే తీసుకెళ్లి తన తల్లి శాలినికి బహుమతిగా ఇచ్చాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."