JR NTR:ఎన్టీఆర్ కి ఇంత క్రేజ్ రావటానికి రాజమౌళి కారణమా…ఇందులో నిజం ఎంత ?
Jr Ntr And Rajamouli: ఎన్టీఆర్ కెరీర్ పూర్తిగా రాజమౌళి వల్లే సాగిందని…రాజమౌళి అనే దర్శకుడు లేకుంటే ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉండేవాడు కాదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మొదటి సినిమా ఫ్లాప్ అవ్వగా స్టూడెంట్ నెం.1 చిత్రంతో మొదటి సక్సెస్ను రాజమౌళి అందించాడు.
ఆ తర్వాత మళ్లీ వరుసగా ఫ్లాప్స్ పడ్డ నేపథ్యంలో సింహాద్రి చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది కూడా రాజమౌళినే.ఈ రెండు సినిమాలు ఆయన కెరీర్ను ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లాయి.
ఇక అయిదు సంవత్సరాల పాటు ఎన్టీఆర్ హిట్ అన్నది ఎరుగక కొన్ని కారణాలతో అసలు సినిమా కెరీర్ నాశనం అయ్యిందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా యమదొంగ ఇచ్చి మళ్లీ కెరీర్ నిలబెట్టాడు.
రాజమౌళి వల్లే ప్రతి సారి ఎన్టీఆర్ క్రేజ్ పెరిగి పోయింది.ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్కు పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది.అది కూడా రాజమౌళి వల్లే సాధ్యం అయింది.ఎన్టీఆర్ ప్రతి సారి కూడా రాజమౌళి వల్ల జీవం పోసుకున్నాడు.రాజమౌళి, వినాయక్ దర్శకులు ఎన్టీఆర్ను టాలీవుడ్ స్టార్ హీరోగా నిలబెట్టారంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.
వాళ్లు చేస్తున్న విమర్శలు పక్కన పెడితే ఎన్టీఆర్ కెరీర్లో రాజమౌళి సినిమాలను తీసేసి చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.గత అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాలను వదిలి పెడితే అంతుకు ముందు సినిమాలు కేవలం రాజమౌళి ఇచ్చిన క్రేజ్ వల్లే అనేది నందమూరి అభిమానులు కూడా ఒప్పుకునే విషయం.


