Movies

సాయికిరణ్ సినిమాలకు దూరం కావటానికి ఆ హీరోయిన్ కారణమా…?

తెలుగులో అప్పట్లో ప్రముఖ దర్శకుడు కె విజయభాస్కర్ దర్శకత్వం వహించినటువంటి “నువ్వే కావాలి” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ చిత్రంలో “అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది” అనే పాటలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి హీరో సాయి కిరణ్ గురించి తెలియని వారుండరు.

అయితే హీరో సాయి కిరణ్ వచ్చీరావడంతోనే మంచి విజయాన్ని అందుకని వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కానీ ఆ సినిమాలు ఏవి కూడా సాయి కిరణ్ కి గుర్తింపును తీసుకురాలేకపోయాయి. అయితే తాజాగా సాయి కిరణ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే సాయి కిరణ్ అప్పట్లో తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ప్రియురాలిని తన కుటుంబ సభ్యుల కోసం వదిలిపెట్టాడని సాయి కిరణ్ ప్రేమ గురించి కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

కాగా అప్పట్లో సాయి కిరణ్ ప్రేమించినటువంటి మహిళ కూడా తెలుగు సినీ పరిశ్రమకి చెందిన హీరోయిన్ అని, అంతేగాక ఆమెతో సాయి కిరణ్ పలు చిత్రాల్లో నటించాడట.అయితే హీరో సాయి కిరణ్ ప్రముఖ సింగర్ పి.సుశీల మనవడని చాలామందికి ఇప్పటికీ తెలియదు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సాయి కిరణ్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో నివాసముంటున్నట్లు సమాచారం.

అలాగే ప్రస్తుతం సాయి కిరణ్ చేతిలో పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో బుల్లితెర మీద బాగానే ఆకట్టుకుంటున్నాడు.ఇందులో టాలీవుడ్ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా ఛానెల్ లో ప్రసారమయ్యే కోయిలమ్మ అనే ధారావాహికలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్న సాయి కిరణ్ కి ఆ అవకాశాలన్నీ తీవ్ర నిరాశనే మిగిల్చాయనీ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."