Movies

పారితోషికం విషయంలో మన స్టార్‌ హీరోల తెలివి చూస్తే అబ్బో అంటారు

పారితోషికం విషయంలో మన స్టార్‌ హీరోలు బాలీవుడ్‌ హీరోలను ఏమాత్రం తీసిపోరు అనే విషయం తెల్సిందే. ముఖ్యంగా ఓ పది మంది స్టార్‌ హీరోలు పారితోషికం విషయంలో నిర్మాతలను ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తారు.

కరోనా విపత్తు నేపథ్యంలో హీరోలు పారితోషికాలు తగ్గించుకోవాలని మేకర్స్‌ కోరుతున్నారు.ఇలాంటి సమయంలో మన హీరోలు అసలు పారితోషికాలే తీసుకోకుండా సినిమాలు చేస్తామంటూ ముందుకు వస్తున్నారు.

పారితోషికం తీసుకోకుండా సినిమా నిర్మాణంలో షేర్‌ కోరుతున్నారు.తమ పాత పారితోషికం తగినంత షేర్‌ను డిమాండ్‌ చేస్తున్నారు.సినిమా హిట్‌ ప్లాప్‌తో సంబంధం లేకుండా మొదట తమ పారితోషికం తీసుకుని ఆ తర్వాత లాభాల్లో వాటాలు లేదంటే నష్టాల గురించి చర్చించేలా ఒప్పందం చేసుకుంటున్నారు.

ఇటీవల ప్రారంభం అయిన సర్కారు వారి పాట కు గాను మహేష్‌ బాబు అదే విధంగా డీల్‌ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.మహేష్‌బాబు మాత్రమే కాకుండా యంగ్‌ స్టార్‌ హీరోలు అంతా కూడా ఇదే పద్దతిన ముందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

కేవలం స్టార్‌ హీరోలు మాత్రమే కాకుండా చిన్న రేంజ్‌ హీరోలు కూడా తమ పారితోషికంను పెట్టుబడిగా పెట్టి నిర్మాతలను సేవ్‌ చేసినట్లుగా చేస్తూ లాభాలు పొందుతున్నారు.మొత్తానికి మన హీరోల తెలివితేటలకు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."