Movies

నిత్యా మీనన్ సినిమాలు రిజెక్ట్ చేయటానికి కారణం ఇదే

చాలామంది క‌థానాయిక‌లు అవ‌కాశాల్లేక సినిమాల‌కు దూరం అవుతుంటారు. ఎవ‌రైనా పిలిచి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. అన్న‌ట్టు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. కానీ కొంత‌మంది మాత్రం చేతికి వ‌చ్చిన అవ‌కాశాల్ని సైతం వ‌దులుకుంటుంటారు. నిత్య‌మీన‌న్ అదే టైపు.

కొంత‌కాలంగా నిత్య తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. ఇప్పుడామె చేతిలోనూ సినిమాల్లేవు. ఇలాంటి స‌మ‌యంలో ఏదైనా అవ‌కాశం వ‌స్తే… క‌ళ్ల‌క‌ద్దుకోవాలి. కానీ. మ‌ళ్లీ కాళ్ల‌ద‌న్నుకుంది. టాలీవుడ్‌లో ‘క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి’ బ‌యోపిక్ రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. ఈ బ‌యోపిక్ లో న‌టించే ఛాన్స్ ముందు నిత్య‌నే వ‌రించింద‌ట‌. కానీ.. నిత్య ఆస‌క్తి చూపించ‌లేద‌ని తెలుస్తోంది. క‌థ న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లో, పాత్ర న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లో కాదు, టోట‌ల్ గా త‌న‌కు సినిమాలంటేనే ఇష్టం లేద‌ని, అందుకే చేయ‌డం లేద‌ని తేల్చి చెప్పేసింద‌ట‌. ఇది వ‌ర‌కు కూడా అంతే. కొన్ని సినిమాల్ని ఇలానే వ‌ద్ద‌నుకుంది. మొత్తంగా చూస్తుంటే నిత్య‌కు సినిమాల‌పై పూర్తిగా ఆస‌క్తి త‌గ్గిపోయిన‌ట్టు అర్థం అవుతోంది. సినిమాల్ని వ‌దిలేసి, కొత్త కెరీర్ ఏమైనా మొద‌లెడుతుందేమో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."