Movies

హీరోయిన్ రాధ గుర్తు ఉందా…ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

ఎనభైల్లో ఎంతోమంది కుర్రకారుకు హాట్ ఫేవరేట్ హీరోయిన్ రాధ. ఈరోజు ఆమె పుట్టినరోజు. జూన్ 3, 1965న కేరళ తిరువనంతపురం జిల్లాలో జన్మించిన రాధ అసలు పేరు ఉదయ చంద్రిక. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన రాధ.. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. 1991లో రాజశేఖరన్ నాయర్ ని వివాహమాడిన రాధకి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. రాధ పెద్ద కూతురు కార్తిక ‘జోష్’ చిత్రంతో తెలుగులోనే హీరోయిన్ గా పరిచయం అయింది.

చిన్నకూతురు తులసి మణిరత్నం తీసిన ‘కడలి’తో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ ఇద్దరు హీరోయిన్స్ గా సక్సెస్ అవలేకపోయారు. ముంబైతో పాటు కేరళలో రెస్టారెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు రాధ. ఒకప్పటి హీరోయిన్స్ అంతా రీఎంట్రీ ఇస్తున్న క్రమంలో రాధ కూడా రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నారు ఆమె అభిమానులు. అయితే రాధ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."