బిగ్బాస్ 4 ఛాన్స్ కోసం తపిస్తున్న ఆంటీలు
తెలుగు బిగ్బాస్ సీజన్ 4 కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటికే కంటెస్టెంట్స్ జాబితాను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ జాబితాను స్టార్ మా మరియు బిగ్బాస్ నిర్మాతలు పరిశీలిస్తున్నారు.ఈ జాబితాలో ఇద్దరు సీనియర్ నటిలు పోటీ పడుతున్నారు.
వారిలో ఒకరు సురేఖ వాణి కాగా మరొకరు ప్రగతి.వీరిద్దరు కూడా తెలుగు సినిమాల్లో హీరోల హీరోయిన్స్ తల్లి అత్త పాత్రల్లో నటించి మెప్పించారు.వీరిద్దరికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.బిగ్బాస్ నిర్వాహకులు వీరిద్దరిలో ఖచ్చితంగా ఒకరిని తీసుకునే అవకాశం ఉంది.
ఆ ఒక్కరు ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.ఈమద్య కాలంలో వీరిద్దరు కూడా సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు.దానికి కారణం బిగ్బాస్లో ఎంపిక కావాలనే ఉద్దేశ్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఎప్పుడు కూడా పెద్దగా సోషల్ మీడియాలో ఉండని ప్రగతి ఈమద్య వరుసగా హాట్ వీడియోలు పోస్ట్ చేయడంతో పలు యాక్టివిటీస్ చేస్తోంది.
ప్రగతి మరియు సురేఖ ఇద్దరు కూడా మంచి ఫేమ్ ఉన్న వారు కావడంతో ఖచ్చితంగా ఈ సారి బిగ్బాస్ సీజన్ మంచి జోరుగా సాగుతుందని అంటున్నారు.గత సీజన్లో హేమను నిర్వాహకులు ఎంపిక చేశారు.
కాని కొన్ని కారణాల వల్ల ఆమె మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.ఆమెకు బిగ్బాస్ మంచి పేరు తెచ్చి పెట్టక పోగా విమర్శలు తెచ్చి పెట్టింది.మరి వీరిద్దరిలో ఎవరు వెళ్తారు ఎలాంటి ఫలితాన్ని పొందుతారనేది కాలమే నిర్ణయించాలి.
