Movies

అఖిల్ సినిమా రీ షూట్ కోసం నాగ్ పట్టు ? రిపేర్లు మొదలు అయ్యాయా?

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటి,తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచాడు. అయితే తన ఇద్దరు తనయులైన అఖిల్, నాగ చైతన్య లను సినిమాకు ఎంట్రీ ఇప్పించాడు. కానీ సరైన హిట్స్ పడడంలేదు. అందుకే వారిద్దరి సినిమాలపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాడు. తన సినిమాలతో పాటు తనయుల మూవీస్ పై కూడా కన్నేసి ఉంచుతున్నాడు. ఇప్పుడు కూడా అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాపై నాగార్జున పూర్తి ఫోకస్ పెట్టాడని టాక్. ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో ఈ మధ్యే ఫైనల్ కట్ చూసినట్లు ప్రచారంఅవుతోంది.

బొమ్మరిల్లు, పరుగు సినిమాల తర్వాత భాస్కర్‌ను ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయారు. అలాంటి దర్శకుడు చెప్పిన కథ నచ్చి అఖిల్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు.ఇదిలా ఉంటే సినిమాలో కొన్ని సన్నివేశాలపై నాగార్జున అసంతృప్తిగా ఉన్నాడట. వీటిని రీ షూట్ చేయాలని దర్శకుడికి నాగార్జున సూచించినట్లు ప్రచారం అవుతోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ గతంలో కూడా కొన్ని సినిమాలకు నాగ్ రీ షూట్ చేయించాడు. రీ షూట్ చేస్తే సినిమా బాగోకపోవడం కాదు.. ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం అని చెప్తాడు.

ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలను ఇంకా బాగా షూట్ చేయాలని ప్రయత్నించాలని బొమ్మరిల్లు భాస్కర్‌కు నాగార్జున చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇప్పుడు నాలుగో సినిమాపై ఆశలు బాగానే పెట్టుకున్నాడు అఖిల్. ఇలాంటి సమయంలో నాగార్జున కూడా కొడుకు సినిమాపై మరింత ఫోకస్ పెంచాడు. నిజానికి ఈ మూవీని ఎప్రిల్లోనే విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కూడా ఉండటంతో ఇప్పట్లో సినిమాలు విడుదల చేయకూడదని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండటంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాపై ఆసక్తి ఉంది. మరి మార్పులతో రీ షూట్ చేస్తారా లేదా అనేది చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."