Movies

త్రివిక్రమ్ , మెగా కాంబోపై క్లారిటీ వచ్చేసిందా…నిర్మాత ఎవరో…?

ఇండస్ట్రీలో కొందరి కాంబినేషన్ కోసం ఫాన్స్ చాలా ఎదురుచూస్తారు. కానీ గమ్మున వర్కవుట్ కావు … తీరా అది కార్యరూపం లోకి వస్తే మాత్రం ఆనందానికి అవధులుండవు . ఇదంతా ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబోలో మూవీ గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లక ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తే బాగుంటుందని అందరూ భావించారు. అయితే అప్పట్లో కుదరలేదు. మళ్లీ చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అయినా త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఆశిస్తున్నారు. గతంలో పలు ఇంటర్వ్యూల్లో త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఉందని చిరంజీవి చెప్పేసాడు. అయితే ఇటీవల త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ కు చిరంజీవి ఓకే అనేసినట్లు టాక్.

చిరంజీవి త్రివిక్రమ్ ల కాంబో మూవీ వచ్చే ఏడాది కానీ, ఆ తర్వాత ఏడాది అయినా ఖచ్చితంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఢంకా బజాయించి మరీ చెప్తున్నారు. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రంను ఎన్టీఆర్ తో చేసేందుకు ఇప్పటికే సిద్దం అయ్యాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే ఎన్టీఆర్ తో సినిమా త్రివిక్రమ్ మొదలు పెట్టబోతున్నాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ కూడా ఉంటుందని కూడా టాక్ నడుస్తోంది. అయితే చరణ్ కంటే ముందు చిరంజీవి త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని మెగా కాంపౌండ్ నుంచి వినికిడి.

కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం చిరంజీవి ఆచార్య చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ తర్వాత మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ లో చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. సుజీత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని అంటున్నారు. వీరిద్దరి కాంబోకు మెగా ఫ్యాన్స్ లోనే కాకుండా సాదారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబో సినిమాను రాధాకృష్ణ , చరణ్ లు కలిసి నిర్మిస్తారన్న ప్రచారం నడుస్తోంది.