Movies

వకీల్ సాబ్’ సినిమా శృతి రిజెక్ట్ చేయటానికి అసలు కారణం ఇదే

పలానా హీరో పక్కన ఫలానా హీరోయిన్ జతకడితే బానే ఉంటుందని అంచనావేసి మరీ సెలెక్ట్ చేస్తారు. అయితే ఒక్కోసారి అటునుంచి రిజెక్ట్ వస్తే దానిపై రకరకాల ఊహాగానాలు వస్తాయి వైరల్ అవుతాయి. సరిగ్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా పింక్ రీమేక్ గా రూపొందుతున్న ‘వకీల్ సాబ్’ విషయంలో ఇదే జరిగింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని దిల్ రాజు, బోణీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీలో అమితాబ్ నటించిన ‘పింక్’ సూపర్ హిట్ అయింది. ఇక ఈ రిమేక్ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హాసన్ నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ‘గబ్బర్ సింగ్’ ‘కాటమ రాయుడు’ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న హ్యాట్రిక్ కొట్టబోతున్నారంటూ ఫ్యాన్స్ చెప్పుకున్నారు.

ఈ జోడీని మరోసారి స్క్రీన్ పై చూడొచ్చని ఫాన్స్ ఆశించారు. అయితే ఆ తర్వాత శృతి ఈ సినిమాలో నటించడం లేదంటూ న్యూస్ రావడంతో నిరాశకు గురయ్యారు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ మాత్రం ‘వకీల్ సాబ్’లో శృతి హాసన్ నటిస్తోందని చెప్పుకొచ్చాడట. అయితే శృతి హాసన్ ఇటీవల ముంబై నుండి హైదరాబాద్ కి వచ్చి కరోనా నేపథ్యంలో స్వీయ నిర్బంధంలో ఉంటోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు, వేణు శ్రీరామ్ లు శృతి హాసన్ ని ‘వకీల్ సాబ్’ సినిమాలో నటింపజేయాలని ప్రయత్నం చేశారట. అయితే శృతి నో అని చెప్పేసిందట.

ప్రస్తుతం శృతి మాస్ మహారాజా రవితేజ – గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతున్న ‘క్రాక్’ సినిమాలో నటిస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ మూవీలో తక్కువ నిడివి గల పాత్రలు స్పెషల్ రోల్స్ చేసే ఉద్దేశ్యం లేదని శృతి సున్నితంగా తిరస్కరించిందట. వేణు శ్రీరాం – దిల్ రాజులతో కలసి శృతి హాసన్ ఇంతక ముందు ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత కూడా దిల్ రాజు బ్యానర్ లో పలు చిత్రాల్లో నటించింది. ఈ పరిచయంతో ‘వకీల్ సాబ్’లో స్పెషల్ రోల్ చేయమని అడిగినప్పటికీ శృతి సున్నితంగా కాదనేసింది. అయితే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్క బోతున్న సినిమాలో శృతి హాసన్ నటించే ఛాన్స్ ఉందట.