Movies

ఈటీవీలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఎప్పటి నుంచో తెలుసా ?

లాక్ డౌన్ మూలాన మన తెలుగు ప్రేక్షకులు ఎంతో వినోదాన్ని అయ్యారు. అయినా ప్రేక్షకుల కోసం అన్ని ఛానల్స్ వారు పాత కార్యక్రమాలు అయినా సరికొత్తగా అందించి వినోదం మిస్ కాకుండా చూసారు. ఆ విషయంలో కూడా టాప్ ఛానెల్స్ లో ఒకటి అయినటువంటి ఈటీవీ ఛానెల్ అత్యధిక ఇంప్రెషన్స్ తో టాప్ లో నిలిచింది.

షోలు అయినా ఈవెంట్స్ కి అయినా పెట్టింది పేరు “ఈటీవీ”. ఈ ఛానెల్లో ప్రసారం అయ్యే ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే . అలాంటి ఛానెల్ ఇప్పుడు మళ్ళీ తమ ఫ్రెష్ స్టఫ్ ను తమ అభిమాన ప్రేక్షకులకు అందివ్వడానికి సిద్ధం అయ్యిపోయింది.

ఈ జూన్ 22 నుంచి అన్ని కార్యక్రమాలు పునః ప్రారంభం అవ్వనున్నట్టుగా తెలుపుతున్నారు. సో మళ్ళీ ఈటీవీ ప్రేక్షకులకు నవ్వుల పంటలు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ రావడం ఖాయం అని చెప్పాలి.