సొంత బిజినెస్ స్టార్ట్ చేస్తున్న రవితేజ…ఎంతవరకు సక్సెస్ అవుతాడో…?
మాస్ మహారాజా గా పేరొందిన రవితేజ ఆమధ్య వరుస హిట్స్ తో దూసుకెళ్ళినప్పటికీ ఈమధ్య బాగా వెనుకబడ్డాడు. పైగా ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం,రిలీజ్ చేయడం అన్నీ కష్టమే. ఇక కరోనా లాక్ డౌన్ తో సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఎవరూ ఎక్కువ రిస్క్ చేసే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. రెమ్యునరేషన్స్ కూడా భారీగానే తగ్గిస్తారట.
ఇలాంటి సమయంలో తానే కొత్త బ్యానర్ పెట్టి సినిమాలు తీయాలన్న ప్లాన్ లో రవితేజ ఉన్నాడట. ఇప్పటికే మహేష్ బాబు,తారక్,రామ్ చరణ్,అల్లు అర్జున్ ఇలా అందరికీ సొంత బ్యానర్స్ ఉండనే ఉన్నాయి. అందుకే తన పిల్లల పేర్లు కూడా కల్సి వచ్చేలా బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడట. మంచి కథతో డైరెక్టర్స్,రచయితలు తనని కల్సుకునేలా ప్లాన్ చేస్తున్నాడట. దీనివలన మళ్ళీ పుంజుకోవచ్చని భావిస్తున్నట్లు టాక్. అయితే రవితేజకు పూరి జగన్నాధ్ ఈ విషయంలో పూర్తి సపోర్ట్ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కేవలం తను హీరోగా చేయడమేకాక కొత్తగా వచ్చే టాలెంట్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేయాలని కూడా రవితేజ ఈ కొత్త బ్యానర్ పెడుతున్నట్లు టాక్. ప్రస్తుతం క్రాక్ మూవీ చేస్తున్నాడు. దీనిపై ఆశలు ఎక్కువ పెట్టుకున్నాడు. లాక్ డౌన్ లో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫోటోలు పెడుతూ పలకరిస్తున్న రవితేజ ఇక కరోనా వైరస్ తగ్గాక సినిమాలు స్టార్ చేయడానికి వక్కంతం వంశీ,త్రినాధరావు నక్కిన,రమేష్ వర్మ తదితరుల సినిమాలను ఇప్పటికే లైన్ లో పెట్టాడట.
