టాలీవుడ్ లో మెరిసిన ఈ యువ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీ హర్శ కొనుగంటి దర్శకత్వం వహించిన హుషారు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి ఎంతగానో మెప్పించిన హీరోయిన్ దక్ష నగర్కర్ గుర్తుందా? ఎందుకంటే ఈ అమ్మడు తెలుగు లో ఒక చిత్రం లో మాత్రమే నటించినప్పటికీ తెలుగు ఆడియన్స్ దృష్టిలో బానే పడింది. కానీ తన మొదటి చిత్రంతోనే బాగా ఆకట్టుకున్నటువంటి ఈ అమ్మడు అవకాశాలు దక్కించుకునే విషయంలో కొంతమేర ఎందుకో తడబడుతోంది.
అయితే ఈ మధ్య కాలంలో సినిమా షూటింగులు లేకపోవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటికే పరిమితమై సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్ గానే ఉంటున్నారు. ఇందులో భాగంగా తన అందమైన ఫోటోలను ఇంస్టాగ్రామ్, పేస్ బుక్ సోషల్ మీడియా మాధ్యమాలను షేర్ చేస్తూ.. ఈ అమ్మడు కుర్రకారు మతి పోగొడుతోంది.
అంతేగాక ఈ మధ్యకాలంలో ఈ అమ్మడి సోషల్ మీడియా మాధ్యమాలలో ఫాలోవర్స్ సంఖ్య కూడా బాగానే పెంచుకుంటోంది.అయితే ఈ అమ్మడు తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఎలాంటి పాత్రలలో అయినా నటించేందుకు సిద్ధమని దర్శక నిర్మాతలకి సిగ్నల్స్ పంపుతోంది. ఇలా ఆఫర్ల కోసం పంపే సిగ్నల్స్ కి దర్శక నిర్మాతలు ఎంతవరకూ స్పందిస్తారో అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ తో చాలావరకూ నష్టపోయిన ఇండస్ట్రీ తక్కువ రెమ్యునరేషన్ కి వచ్చే నటీనటులనే సెలెక్ట్ చేస్తారనే టాక్ ఉంది. ఎంతమందికి ఛాన్స్ లు వస్తాయో మరి.

