నిజం సినిమా అట్టర్ ప్లాప్ వెనక అసలు నిజాలు ఏమిటో ?
అవినీతిపై అస్త్రం సంధిస్తూ డైరెక్టర్ తేజ తీసిన మూవీ నిజం. ఇందులో మహేష్ బాబు హీరోగా చేస్తే, రక్షిత హీరోయిన్ గా చేసింది. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా వచ్చిన మహేష్ కి ఒక్కడు మూవీతో స్టార్ హీరోగా తన రేంజ్ ఎక్కడికో వెళ్ళింది.
సరిగ్గా అలాంటి సమయంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ మూవీ పై ఫాన్స్ లో చాలా ఆశలు ఏర్పడ్డాయి. కానీ ఫాన్స్ కి తీరని నిరాశ మిగిలింది. డిజాస్టర్ మూవీగా నిల్చింది. గోపీచంద్ విలన్ గా, రాశి ఐటెం గర్ల్ గా చేసిన ఈ మూవీ దారుణ పరాజయం మూటగట్టుకుంది.
చిత్రం మూవీతో హిట్ కొట్టి,నువ్వు నేను,జయం మూవీస్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న తేజ అనగానే భారీ అంచనాలున్నాయి. ఇక ఒక్కడితో రేంజ్ మార్చిన మహేష్ బాబు. ఇక ఈ కాంబోని ఎంతోగొప్పగా ఊహించుకున్నారు. ఆకాశమే హద్దు అన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో హైప్ క్రియేట్ అయింది.
షూటింగ్ సమయంలోనే హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీ 2003మే24భారీ అంచనాలతో విడుదలైంది. 7కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీని బయ్యర్లు ఎగబడి కొనడంతో 21కోట్లకు బిజినెస్ చేరింది. ఓ అమ్మాయికోసం సాహసం చేసిన ఒక్కడు చూసిన వాళ్ళకి తల్లి సాయం లేకుండా ఏమిచేయలేని వాడిగా మహేష్ ని చూపించడం జనం జీర్ణించుకోలేదు.
పైగా కళ్లెదుట తండ్రి ని చంపేసినా ఏమీచేయలేని వాడిగా మిగిలిపోవడం వంటి ఘటనలను ఫాన్స్ ఊహించుకోలేకపోయారు. దాంతో ధియేటర్ నుంచి వస్తూనే నిట్టూర్పులు,పెదవి విరుపులు కనిపించాయి. ఫాన్స్ లో నిరాశ. గోపీచంద్ విలనిజం ముందు మహేష్ భేల గా హీరోయిజం వెలవెల బోయింది.
నిజానికి భారతీయుడు లాంటి రేంజ్ లో ఉండే ఈ సినిమా కంటెంట్ పరంగా ఫెయిల్ అయింది. అంచనాలు దెబ్బతిన్నాయి. బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు మహేష్ కి వస్తే, సపోర్టింగ్ యాక్టర్ గా తల్లి పాత్ర వేసిన తాళ్ళూరి రామేశ్వరి కి అవార్డు వచ్చింది. కానీ ఈ సినిమా ఆసమయంలో రావాల్సింది మాత్రం కాదని ఇప్పుడు చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది.


