Movies

జబర్దస్త్ షో ఇప్పట్లో లేనట్లేనా – రోజాయే కారణమా …అసలు నిజం ఇదే ….?

మొదలు పెట్టిన నాటినుంచి ఇప్పటివరకూ అంటే లాక్ డౌన్ ముందు వరకూ జబర్దస్త్ రేటింగ్ అదుర్స్. కానీ కరోనా మహమ్మారితో లాక్ డౌన్ విధించడంతో అన్ని షూటింగ్స్ ఆగిపోవడంతో జబర్దస్త్ కూడా నిలిచిపోయింది. అయితే లాక్ డౌన్ నిబంధనల సడలింపు కొన్ని షరతులతో మినహాయింపులు ఇచ్చినా సరే, షూటింగ్ కి రావడానికి భయపడుస్తున్నారు. దీనికి కారణం కరోనా కేసులు పెరగడమే. ఇక నటి, రాజకీయ నాయకులు, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ జడ్జిగా ఉంటోంది. కానీ ఇప్పుడు ఆమె గన్‌మెన్‌ కరోనా బారినపడిన పడడంతో ఆమె ప్రస్తుతం సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నారు.

అది అలా ఉంటే ఆమె ఓ వైపు అటు రాజకీయాలు చేస్తూనే.. ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. లాక్ డౌన్‌లో కొన్ని సడలింపుల అనంతరం ప్రస్తుతం ఈ షో వారానికి రెండు సార్లు షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రోజా గన్ మెన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో.. జబర్దస్త్ షూటింగ్‌లో పాల్గొనలంటే నటులు భయపడుతున్నారట. ఎక్కడ కరోనా సోకుతుందో అని అందోళన చెందుతున్నారట. ఇక మల్లేమాల యాజమాన్యం కూడా కొన్ని రోజులు పాటు షూటింగ్ వాయిదా వెయ్యాలనీ నిర్ణ యించినట్లు టాక్ .

ఈ నేపథ్యంలో కొత్త ఎపిసోడ్ ప్రసారానికి తిప్పలు తప్పేలా లేవని అంటున్నారు. ఒక వేళ రోజా క్వారెంటైన్‌లో ఉంటూ షూటింగ్‌కు రాకపోతే ఆమె బదులు మరో గెస్ట్ వచ్చే ఆస్కారం ఉంది. ఆ విధంగా షోను మరోసారి ఆపకుండా ప్రసారం చేసే ఛాన్స్ ఉంది. నాగబాబు జబర్దస్త్‌‌ను వదిలి వెళ్లిన తర్వాత ప్రస్తుతం షోలో రోజాతో పాటు గాయకుడు మనో జడ్జ్‌గా చేస్తున్నాడు. ఇక కరోనా వల్ల టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు మరణించగా, తాజాగా బిగ్ బి అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ కూడా కరోనా బారిన పడడమే కాదు, అనుపమ ఖేర్ కుటుంబం కూడా కరోనా బారిన పడింది. దీంతో ఇప్పుడు అందరిలో భయం నెలకొంది.