Movies

ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా ?

కంటెంట్ ఉంటె ఆడియన్స్ ఆదరిస్తారని తక్కువ బడ్జెట్ తో తీసిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య మూవీ నిరూపించింది. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ తెలుగు సినిమా సత్తా చాటిన ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని ఆతర్వాత పెద్ద బడ్జెట్ పేరుతొ తొందర పడకుండా కంచరపాలెం వంటి చిన్న సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు వెంకటేష్ మహా తో కల్సి ఇప్పుడు మలయాళ మాతృక తో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య తీశారు.

లాక్ డౌన్, కరోనా నేపథ్యంలో ఓ టి టి ద్వారా ఈ సినిమా రిలీజ్ చేసి మంచి ఫలితాన్ని రాబట్టారు. సత్యదేవ్ నటించిన ఈ సినిమా కథ,కధనం నడిపించిన తీరు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. హీరో నటన,డైరెక్టర్ పనితనం ఈ సినిమా చూసేలా ఆడియన్స్ ని ఆకర్షించాయి. నరేష్,సుహాస్,రాఘవన్,హరిచంద్ర,రూప తదితరులు నటించిన ఈ మూవీకి బిజీబల్ సంగీతం అందించాడు. శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేనిలతో పాటు విజయ్ ప్రవీణ్ పరుచూరి నిర్మించారు.

ఇక ఈ మూవీకి మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. ఎంతోమంది సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంది. ముఖ్యంగా కమర్షియల్ గా కూడా ఈ మూవీ తన సత్తా చాటిచెప్పింది. కోటిన్నర రూపాయలు నెట్ ఫ్లిక్స్ ద్వారా వచ్చిందని,దీంతో బడ్జెట్ ఓటిటి తో వచ్చేసినట్టేనని ట్రేడ్ వర్గాల అంచనా. శాటిలైట్ హక్కులను కూడా ఈటీవికి ఇచ్చినట్లు,దీనివలన మరో కోటిన్నర వచ్చినట్లు టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."