టాలీవుడ్ హీరోలకు బ్రేక్ ఇచ్చిన సినిమాలు ఏమిటో తెలుసా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సూపర్ స్టార్ మహేష్ బాబు,స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా దూసుకెళ్తున్నారు. అయితే వీళ్లకు స్టార్ హోదా రావడానికి కెరీర్ మొదట్లో బాగా దోహదపడ్డ సినిమాల విషయానికి వస్తే, ముందుగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించుకుందాం. ఖుషి సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన పవన్ తర్వాత తన టాలెంట్ తో సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. సుస్వాగతం,తొలిప్రేమ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న పవన్ కి ఖుషి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి,స్టార్ హీరో చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రాజకుమారుడు మూవీతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఒక్కడు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతవరకూ ఫామిలీ ఆడియన్స్ కి పరిమితమైన మహేష్ మాస్ ఆడియన్స్ కి ఈ సినిమాతో దగ్గరై,సూపర్ స్టార్ రేంజ్ కి చేరాడు. నందమూరి నట వారసుడిగా, తారకరాముని మనవడిగా ఇండస్ట్రీకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుని మాస్ హీరోగా ఎదిగి స్టార్ హీరో అయ్యాడు.
పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు నట వారసునిగా అడుగుపెట్టిన ప్రభాస్ ఛత్రపతి మూవీతో స్టార్ హీరో అయ్యాడు. ఎస్ ఎస్ రాజామౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మంచి క్రేజ్ తెచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రామ్ చరణ్ తన రెండవ సినిమా మగధీర మూవీతో స్టార్ హీరో అయిపోయాడు. దీనికి కూడా రాజమౌళి దర్శకుడు. మెగా మేనల్లుడిగా అల్లువారి అబ్బాయిగా ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ చాలా హిట్స్ అందుకున్నాడు. అయితే సరైనోడు మూవీతో స్టార్ హీరో అయ్యాడు.

