Movies

గొప్ప నటుణ్ని కోల్పోయిన టాలీవుడ్

సీనియర్ నటుడు, కమెడీయన్ జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. బ్రహ్మపుత్రుడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జయప్రకాష్ రెడ్డి ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్‌, సరైనోడు వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకొని అభిమానుల్లో తనదైన ముద్రను వేసాడు.

కమెడియన్‌గానే కాకుండా విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించాడు. నేడు తెల్లవారుజామున గుంటూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే పడి అక్కడికక్కడే మృతి చెందారు. కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల ఆయన స్వగ్రామం కాగా సినిమాలోకి రాకముందు ఆయన ఎస్సైగా పనిచేశారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."