Movies

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా… ఎంత సన్నగా అయిపోయిందో…?

మహేష్ బాబు వెంకటేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా నటించిన తెలుగు అమ్మాయి అంజలి గుర్తుంది కదా. ఆమె తెలుగు కన్నా తమిళ్లో బాగా హిట్ అయింది. కరోనా కారణంగా షూటింగ్ ఏమీ లేకపోవడం వల్ల ఈ అమ్మడు ఇంట్లో ఉండి ఐదు నుంచి పది కేజీల వరకు బరువు తగ్గింది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలతో ఈ విషయం బయటపడింది.

ఈ లాక్ డౌన్ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుని నాజూగ్గా తయారైంది. ప్రస్తుతం అంజలి నిశ్శబ్దం అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. OTT ఫ్లాట్ ఫామ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇక ఇప్పుడు బోయపాటి శీను దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయింది అంజలి. తెలుగులో కూడా సక్సెస్ రావాలని కోరుకుందాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."