Kitchen

Aloo Matar Recipe:ఆలూ బఠాణి కుర్మా ఈ సారి ఇలా ఈజీగా చెయ్యండి.. చాలా టేస్టీగా..

Aloo Matar Recipe:ఆలూ బఠాణి కుర్మా ఈ సారి ఇలా ఈజీగా చెయ్యండి.. చాలా టేస్టీగా.. ఆలుమటర్ గ్రేవీ ని ముఖ్యంగా రొటీస్ తో మరియు రైస్ కి సైడ్ డిష్ గా తయారుచేస్తారు. దీనిని ఆలూ, బఠానీలను కొన్ని టమోటా లతో మరియు కొన్ని మసాలాలతో కలిపి ఈ రెసిపీ ని తయారుచేస్తారు

కావలసిన పదార్దాలు :
బంగాళాదుంపలు 1/2 కిలో
బటానీలు 1 /2 కప్పు
ఉల్లిపాయలు ౩
టొమాటో 1
అల్లం – వెల్లులి ముద్ద 1 చెంచా
ధనియాల పొడి 1 చెంచా
కారం 1/2 చెంచా
పంచదార కొంచెం
ఉప్పు, నెయ్యి సరిపడా
సోంపు 1 /2చెంచా
గరం మసాల 1 /2 చెంచా

తయారి విదానం :
బటాణి లను, బంగాళాదుంపలు విడివిడిగా కుక్కర్ లో ఉడికించి తీసి బంగాళాదుంపలు తోలు తీసి ముక్కలు చేసి ఉంచాలి. ఉల్లిముక్కలు చేసి కచ్చా పచ్చా గా మిక్సీ వేసి ఉంచాలి. టొమాటో లను వేడి నీటి లో ఉడికించి మిక్సీ వేయాలి. బాండి లో నెయ్యి వేసి కాగిన తరువాత సోంపు, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి వేపాలి.

తర్వాత ఉల్లి ముద్ద వేసి టొమాటో రసం, గరం మసాల, కారం, ఉప్పు, పసుపు, పంచదార వేసి నెయ్యి పైకి తేలేంతవరకు వేపాలి. వేగిన వాసన వచ్చిన తర్వాత బటాణి, బంగాళాదుంప ముక్కలు వేసి కొంచెం నీళ్లు పోసి మసాల బాగా దగ్గరకు వచ్చిన తరువాత దించే ముందు కొత్తిమీర చల్లి దింపాలి. చివర లో కొంచెం క్రీం వేస్తె చాలా రుచిగా ఉంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."