Movies

మరో కొత్త కోణంలో సినిమాల రిలీజ్…వర్క్ అవుట్ అవుతాయా?

కరోనా దెబ్బకు ప్రపంచమే అతలాకుతలం అయిపొయింది. అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రజలు ఆరోగ్య పరంగానే కాదు, ఆర్ధికంగా కూడా చాలా రంగాలు దెబ్బతిన్నాయి. అందులో సినిమా రంగం కూడా దారుణంగా దెబ్బతినేసింది. ఒక్క టాలీవుడ్ కే వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. షూటింగ్ లు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక థియేటర్లు పూర్తిగా మూతపడ్డాయి.

లాక్ డౌన్ తర్వాత మెల్లిగా ఒక్కో రంగం తెరుచుకుంటున్నప్పటికీ సినిమా రంగం ఈమేరకు మళ్ళీ నిలదొక్కుకుంటుందో అప్పుడే ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎన్ని మార్పులు,ఎన్ని మలుపులు ఉంటాయో చెప్పడం కష్టమే. థియేటర్లు లేకపోవడంతో తీసిన సినిమాలకు పెట్టిన ఖర్చులో కొంతలో కొంత వస్తే చాలన్న రీతిలో కొన్ని సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఓటిటి లో రిలీజ్ చేసారు. కొందరు మాత్రం థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడే బొమ్మ పడాలని పట్టుదలగా ఉన్నారు.

ఇప్పుడు ఓటిటి మాత్రమే కాకుండా సబ్ స్క్రిప్షన్ పద్దతిలో పేమెంట్ కూడా ఉండేలా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో మార్పులు రాబోతున్నాయని , దాన్ని పే ఫర్ వ్యూ అంటారని టాక్. దీని ద్వారా అదనంగా డబ్బులు వస్తాయని అంచనా వేస్తున్నారు. మరి ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలన్న మాట వినిపిస్తోంది. సాయి ధర్మ తేజ్ నటించిన సోలో బతుకే సో బెటర్ మూవీ జి 5లో పే ఫర్ వ్యూ సిస్టం లో రిలీజ్ చేస్తారట. ఇక సాయి ధర్మ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇస్తూ తీసిన ఉప్పెన మూవీ మాత్రం థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడే రిలీజ్ చేయాలనీ అంటున్నాడు. అక్టోబర్ 15తర్వాత థియేటర్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.