Movies

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు పెళ్లయ్యాక ఎలా ఉన్నారో తెలుసా ?

Tollywood Child Artists :సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి,పలు సినిమాలు చేసి పెద్దయ్యాక హీరోయిన్స్, సపోర్టింగ్ ఆర్టిస్టులుగా, మరికొందరు వేరే రంగాల్లో ఉంటూ పెళ్ళిచేసుకుని సెటిల్ అయ్యారు. అలాంటి వాళ్ళల్లో ప్రధానంగా చూస్తే, దాదాపు 20మూవీస్ లో బాలనటిగా ఆతర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టుగా రాణించిన సునయన రెండేళ్ల వయస్సులోనే మనసు మమత మూవీతో మంచి పేరు తెచ్చుకుని, అమ్మోరు మూవీలో చేసిన నటనకు మంచి క్రేజ్ వచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా రాణించిన సునయన తాజాగా ఓబేబి మూవీలో సపోర్టింగ్ నటిగా మంచి నటన కనబరిచింది.

వినయ కుమార్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీళ్ళకి ఓ కొడుకు ఉన్నాడు. యూట్యూబ్ ఛానల్ లో సిరీస్ తో వినోదం పంచుతోంది. ఇక నువ్వు నాకు నచ్చావ్ మూవీతో అందరిని అలరించిన సుదీప ఎన్నో సినిమాల్లో నటించి, పెద్దయ్యాక సపోర్టింగ్ రోల్స్ లో చెల్లెలి పాత్రలో అలరించింది. టివి రంగంలో ఎంట్రీ ఇచ్చి పసుపు కుంకుమ, కొత్త బంగారు లోకం, ప్రతిఘటన వంటి సీరియల్స్ లో చేసింది. సీరియల్స్ లో బిజీగా ఉండగానే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రంగనాధ్ ని పెళ్లిచేసుకుంది. ఈమెకు ఓ కూతురు.

జయం మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా శ్వేతా యామిని మంచి నటన కనబరిచింది. సదా సిస్టర్ గా అక్షరాలను తిరగరాస్తూ అలరించింది. అయితే మళ్ళీ సినిమాల్లోకి రాలేదు. ఆమె తల్లి జయలక్ష్మి కూడా నటిగా రాణించింది. శ్వేతా యామిని పెద్దయ్యాక అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా చేస్తోంది. ఈమె భర్త కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీరు. అలాగే లిటిల్ సోల్జియర్స్ మూవీలో బాలనటిగా మంచి పేరుతెచ్చుకున్న కావ్య ఐ యామ్ ఏ గుడ్ గర్ల్ పాటతో అందరిని అలరించింది. పెద్దయ్యాక డాక్టర్ అయింది. ఒక్క సినిమాతోనే ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకున్న కావ్య మళ్ళీ సినిమా రంగంలోకి రాలేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."