Movies

ఈ హీరోని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా ?

Krishnudu Slim Unseen Rare pic :ఆకారాన్ని కాకుండా టాలెంట్ చూసి, నటన చూసి విషయం చెప్పాలని నిరూపించిన టాలీవుడ్ హీరో కృష్ణుడు. లావుగా ఉన్నా సరే, హీరోగా రాణించి అదరగొట్టిన కృష్ణుడు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజోలు దగ్గర చిన్నపల్లెటూరిలొ జన్మించాడు. ఇతడి పూర్తి పేరు అల్లూరి కృష్ణంరాజు. చించినాడ జమీందారీ వంశానికి చెందిన కృష్ణుడు పుట్టుకతో ఐశ్వర్య వంతుడు. సాధారణంగా సినిమాల్లోకి వచ్చి సంపాదించినవాళ్లను చూస్తాం. కానీ యితడు శ్రీమంతుడు.

చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి గల కృష్ణుడు 4,500ఎకరాలకు వారసుడు. ల్యాండ్ సీలింగ్ లో భూములు పోయినా డబ్బుకి కొదవలేదు. అందుకే డబ్బుకోసం కాకుండా నటనకోసం సినిమా రంగంలోకి వచ్చాడు. హీరోగా, స్టార్ కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా రాణించిన కృష్ణుడి ఇల్లు చూస్తే కళ్ళు చెదురుతాయి. సూర్య పేలస్ పేరిట సొంత ఊరిలో ఉన్న ఇల్లు స్టార్ హోటల్ ని మరపిస్తుంది. ఒక కోటలా ఉంటుంది.

ఆ ఊరు వెళ్ళినవాళ్ళు తప్పనిసరిగా ఈ కోట చూసి వెళ్లాల్సిందే. డిగ్రీ చదివే రోజుల్లో సన్నగా , బక్కపలచగా ఉండేవాడు. అనుకోకుండా ప్రమాదం జరిగి రెండేళ్లు మంచానికి పరిమితం కావడంతో లావెక్కిన కృష్ణుడిగా ఇండస్ట్రీలో దర్శనమిచ్చాడు. పాత ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతాం. ఇతనికి భార్య లలితా, కూతురు నిత్యా వున్నారు. హ్యాపీ డేస్, చందమామ కథలు, మిస్టర్ పెర్ఫెక్ట్, ఏం మాయ చేసావే ఇలా ఎన్నో సినిమాల్లో చేసాడు. స్టార్ మాలో యువ సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ ని కూడా అలరించాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."