MoviesTollywood news in telugu

గ్లామర్ కి భిన్నంగా టాలీవుడ్ హీరోలు…రూట్ మార్చారు

Narappa Movie :సాధారణంగా హీరోయిన్స్ కన్నా అందంగా కన్పించాలని, హీరోయిజం టాప్ రేంజ్ లో ఉండాలని కోరుకుంటూ అందుకు తగ్గ పాత్రల డిజైన్ కోసం పట్టు బట్టే టాలీవుడ్ హీరోలు ఇప్పుడు రూటు మార్చారు. గ్లామర్ కి భిన్నంగా , డీ గ్లామరైజ్ పాత్రలవైపు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.

ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మేకప్ పక్కన పెట్టి, నటనకు స్కోప్ ఉండే పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప మూవీలో కూడా బన్నీ ఇలాంటి డీగ్లామర్ రోల్ చేస్తున్నాడు.

చిరాకు చూపులతో బన్నీ మాస్ ఆడియన్స్ లో మరింత పేరు తెచ్చుకోడానికి బన్నీ ట్రై చేస్తున్నాడు. ఇక లేడీ ఫాలోయింగ్ ఫుల్లుగా ఉన్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు నారప్ప గెటప్ లో రఫ్ ఆడిస్తున్నాడు. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అయినా వెంకీ పాజిటివ్ దృక్పధంతో ఉన్నాడు. మొత్తానికి డీ గ్లామరైజ్డ్ పాత్రలకు హీరోలు మొగ్గు చూపడం విశేషం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."