MoviesTollywood news in telugu

సుల్తాన్ సినిమా గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Sultan Movie :ఒకరు కాదు, ఏకంగా ముగ్గురు మాస్ హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణంరాజు, నటసింహం బాలకృష్ణ కల్సి నటించిన మూవీ సుల్తాన్. ఈ సినిమా నిర్మాణ దశలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. నటుల నటన దెబ్బతినకుండా, నటుల ఇమేజ్ కి భంగం రాకుండా సినిమా తీయడం నిజంగా కత్తిమీద సామే.

అయితే దర్శకుడు శరత్, రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఇలాంటివి సాధ్యమేనని మరోసారి ఈ మల్టీస్టారర్ మూవీ ద్వారా నిరూపించారు. ఈ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయడం వలన దర్శకుడు బాగానే హేండిల్ చేసారు. బాలయ్యతో బాలగోపాలుడు మూవీ నిర్మించిన ఎంవీఆర్వి ప్రసాద్ దీన్ని నిర్మించారు.

బాలయ్య తండ్రి ఎన్టీఆర్ తో 5 సినిమాల్లో కల్సి నటించిన కృష్ణ ఆ తర్వాత హరికృష్ణ, బాలయ్యలతో కల్సి కూడా నటించి రికార్డ్ క్రియేట్ చేసారు. కృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, కృష్ణంరాజు పోలీసాఫీసర్ గా చేసారు. ఈమూవీలో కృష్ణ నటిస్తే బాగుంటుందని మొదటగా పరుచూరి సోదరులు సూచించడం, బాలయ్య , కృష్ణ లను సంప్రదించగా ఒకే చెప్పడంతో షూటింగ్ మొదలు అయింది.

మరోపాత్ర కూడా కీలక నటుడు పోషిస్తే మంచిదని అందరూ భావించారు. దాంతో కృష్ణంరాజుని సంప్రదించగా ఒకే చెప్పేసారు. అలా ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ తీశారు. అయితే సీనియర్ నటులపట్ల గౌరవంతో వాళ్ళ సీన్స్ ముందు తీసేస్తే, తర్వాత మన సీన్స్ మెల్లిగా తీసుకోవచ్చని బాలయ్య సూచించారు.

తీవ్రవాదం, దేశభక్తి ఇతివృత్తంగా గల ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసాడు. అండమాన్ లో షూటింగ్ తీసినప్పుడు ముగ్గురు హీరోలు తమ ఫ్యామిలీ లతో వచ్చారు. అక్కడ రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ తప్ప మరొకటి లేదు. అందరూ అక్కడే ఉన్నారు. మొదటిరోజు ఆకలి వేస్తె, బిస్కట్లు తినేసి గడిపేశారు.

మర్నాడు బియ్యం, కూరలు రప్పించి, విజయనిర్మల వండి వడ్డించారు. ఆ తర్వాత సముద్రంలో బాలయ్య చేపలు పట్టి తెస్తే, పులుసు పెట్టి, లొకేషన్ కి తీసుకెళ్లగా అందరూ ఆవురావురు మంటూ తింటుంటే, విజయనిర్మల ఆనందంతో పొంగిపోయారు. ఎందుకంటే ఇలా అందరికీ వండి పెట్ట్టడమంటే ఆమెకు ఇష్టం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."