MoviesTollywood news in telugu

సత్య దేవ్ కెరీర్ సక్సెస్ కి కారణం ఆమేనట…ఆమె ఎవరో తెలుసా?

Hero Satyadev : లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూసెయ్యడంతో ఒక్కసారిగా డిజిటల్ రంగంలో మార్పులు వచ్చేసాయి. సినిమాలు చాలావరకూ ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ మీద రిలీజయ్యాయి. అందులో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య మూవీ బాగానే ఆకట్టుకుంది. మంచి మార్కులు పడ్డమే కాదు, కలెక్షన్స్ పరంగా కూడా లాభం తెచ్చిందని టాక్ వచ్చింది.

ఇందులో హీరోగా చేసిన సత్యదేవ్ విశాఖ వాసి. ప్రస్తుతం తమన్నాతో కల్సి నటించే ఛాన్స్ కూడా కొట్టేసిన సత్యదేవ్ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ కొట్టిన సరిలేరు నీకెవ్వరూ మూవీలో మిలట్రీ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. ఇక జ్యోతిలక్ష్మి మూవీతో ఎంట్రీ ఇచ్చిన యితడు మరికొన్ని సినిమాల్లో కూడా హీరోగా చేసాడు.

గువ్వాగోరింక , తిమ్మరుసు, మూవీస్ త్వరలో విడుదల కాబోతున్నాయి. నిజానికి తాను సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వెళ్తానంటే, పేరెంట్స్ ఒప్పుకోలేదని సత్యదేవ్ చెప్పాడు. అయితే తన భార్య ఎంకరేజ్ చేసి, ఒకవేళ సక్సెస్ కాకపోయినా ఎలాగోలా బతకొచ్చని చెప్పిందని,అలాంటి అర్ధాంగి దొరకడం నిజంగా గ్రేట్ అని చెప్పాడు. అందుకే తన విజయంలో భార్య దీపిక పాత్ర కీలకమని చెప్పాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."