MoviesTollywood news in telugu

రూట్ మార్చిన జగపతి బాబు…కారణం ఏమిటో పాపం…!

Jagapati Babu new Movie :ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ముద్రపడిన జగపతి బాబు ఎన్నో హిట్ మూవీస్ చేసాడు. శుభలగ్నం, బడ్జెట్ పద్మనాభం వంటి ఫ్యామిలీ మూవీస్ తో పాటు రొమాంటిక్, యాక్షన్ మూవీస్ కూడా చేసాడు. హీరోగా బాగానే రాణిస్తున్న సమయంలో యంగ్ హీరోలు రావడంతో ఛాన్స్ లు తగ్గుతూ వచ్చాయి.

సినిమాల్లో వచ్చిన ఛాన్స్ లు అందిపుచ్చుకోవాలన్న నానుడి వంటబట్టించుకున్న జగపతి బాబు అందుకు అనుగుణంగా విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. విలన్ గా కూడా మంచి పేరు కొట్టేసాడు. లెజెండ్ మూవీలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో జగపతి బాబు పండించిన విలనిజం సూపర్భ్ . మొత్తం మీద ఫ్యామిలీ హీరో కాస్తా పవర్ ఫుల్ విలన్ గా మారిపోవడంతో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా జగపతి బాబుకి ప్రాధాన్యం ఇస్తున్నారు.

అయితే ఇప్పుడు ఫాథర్ – చిట్టి – ఉమ – కార్తీక్ పేరిట ఓ రొమాంటిక్ మూవీలో మెయిన్ క్యారెక్టర్ లో జగపతి బాబు నటించబోతున్నాడు. అలా మొదలైంది, కల్యాణ వైభోగమే వంటి మూవీస్ తీసిన నిర్మాత దామోదర ప్రసాద్ ఈ సినిమా గురించి ప్రకటించారు. రామ్ కార్తీక్, అసురన్ ఫేమ్ అమ్ము అభిరామి యువ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో జగపతి బాబు తండ్రి పాత్రలో అలరించబోతున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."