Nanditha Raj:’ప్రేమకథా చిత్రమ్’ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Prema Katha Chitram Movie Heroine: చూడగానే అందమైన పెద్ద కళ్ళతో ఆకట్టుకునే విధంగా హీరోయిన్ నందిత రాజ్ రూపం ఉంటుంది. తేజ డైరెక్షన్ లో ‘నీకు నాకు డాష్ డాష్’ మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ కళ్ళసుందరి ‘ ప్రేమకథా చిత్రమ్’ మూవీతో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది.
ఈమధ్య చాలామంది వెబ్ సిరీస్ బాట పట్టడంతో హీరోయిన్ గా ఎక్కువ ఛాన్స్ లు రాక ఈ అమ్మడు కూడా వెబ్ వైపు అడుగులు వేస్తోందని టాక్. ప్రముఖ దర్శకుడు తీసే వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట.
‘ప్రేమకథా చిత్రమ్’ మూవీ తెచ్చిన స్టార్ డమ్ తో నందిత కు ఛాన్స్ లు కూడా బాగానే వచ్చాయి. లండన్ బ్రిడ్జి, రామ్ లీలా, కృష్ణమ్మ పిలిచింది ఇద్దరినీ, శంకరాభరణం వంటి సినిమాల్లో చేసింది. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ హిట్ మూవీ జై లవకుశ లో కూడా ఓ పాత్రలో మెరిసింది. రాజ్ కిరణ్ డైరెక్షన్ లో విశ్వామిత్ర మూవీలో చేసింది.
నందిత 2019 చివరిగా విశ్వామిత్ర అనే సినిమాలో కనిపించింది. విశ్వామిత్ర సినిమా తర్వాత పత్తాలేకుండా పోయింది నందిత. ఆమె మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. దాంతో మళ్ళీ మోడలింగ్ వైపు వెళ్ళినట్టు తెలుస్తోంది. ముందు ముందు ఎవరైనా దర్శకుడికి గుర్తుకు వచ్చి… మళ్ళీ నందితరాజ్ ను తెరమీదకు తీసుకువస్తారేమో వేచి చూడాలి.


