MoviesTollywood news in telugu

పవన్ తొలి సినిమా పేరు ఎత్తితే చాలా కోపం అంటా…కారణం ఎవరో తెలుసా?

Pawan Kalyan First Movie :తొలిసినిమా బాగుంటే , ద్వితీయ విఘ్నం లేకుండా రెండో సినిమా కూడా హిట్ కొడితే ఇక ఇండస్ట్రీలో నిల్చిపోవచ్చని కొందరు చెప్పేమాట. మరికొందరు మొదటి సినిమా పోయినా, రెండో సినిమా నుంచి అందుకోకపోతే ఇక లాభం ఉండదని కొందరు చెబుతారు. కొందరు వరుస హిట్స్ కొట్టి కూడా కనుమరుగవుతారు.

అయితే ఎవరికైనా తన మొదటి సినిమా పేరు చెప్పగానే ఎన్నో మధుర స్మృతులు గుర్తొస్తాయి. మెగాస్టార్ చిరంజీవి తనకు పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు చాలా ప్రత్యేకమైన మూవీస్ అని ఎన్నోసార్లు చెప్పారు. తాను ఎదగడానికి ఉపయోగపడ్డ మెట్లుగా మెగాస్టార్ ఆ సినిమాలను భావిస్తారు. అంచెలంచెలుగా మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఎందరికో స్ఫూర్తి.
Pawan kalyan New Movie remunaration
మెగా కాంపౌండ్ నుంచి అందుకే ఎందరో హీరోలు వచ్చారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ కి గంగోత్రి, మెగా తనయుడు రామ్ చరణ్ కి చిరుత, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ముకుంద ఇలా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ మొదటి సినిమాను గర్వంగా ఫీలవుతారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి సినిమా పేరు ఎత్తితే ఎక్కడలేని కోపం వచ్చేస్తుందట.
Chiranjeevi and pawan kalyan
చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తూ వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ఓ మాదిరిగా ఉంది. అయితే ఈ సినిమాకి ముందు ఆయన జీవితంలో ఎన్నో చేదు సంఘటనలు సంభవించాయట. అందుకే ఈ సినిమా పేరు వినగానే ఆయనకు తన జీవితంలో జరిగిన ఎన్నో ఘోరమైన ఘటనలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా తాను ఇంటి నుంచి పారిపోయిన అంశం గుండెలు పిండేస్తుందట. మధుర స్మృతులు మాట దేవుడెరుగు ఆ సినిమాకి ముందు ఘటనలు పీడకలగా ఉంటాయట.