MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu Heroine mounika :చైల్డ్ ఆర్టిస్టుగా నటించి, పెద్దయ్యాక కూడా సినిమాల్లో మెరిసి,, ఆతర్వాత పెళ్ళిచేసుకుని ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయినవాళ్లు చాలామంది ఉన్నారు. చేసింది కొన్ని సినిమాలే అయినా చెరగని ముద్రవేసుకుంటారు. అలాంటి వాళ్లలో సుహాసిని మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇందిరా’ చిత్రంలో చిన్ననాటి ఇందిరా పాత్రను పోషించిన మౌనిక ఒకరు. ఎన్నో చిత్రాల్లో నటించి, ఆతర్వాత హీరోయిన్ గా కూడా మంచి అవకాశాలు వచ్చే సమయంలో ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించి, మతం తీసుకుని మరీ 2016 లో వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకుని , ఇండస్ట్రీకి దూరమై, సంసార బాధ్యతలను నిర్వహిస్తోంది.

మౌనిక ఈమె అసలు పేరు రేఖ మారుతిరాజ్. ఈమె 1987 ఆగష్టు 27 న తమిళనాడులో మారుతి రాజ్, గ్రేసీ పుట్టింది. తండ్రి హిందువు. తల్లి క్రిస్టియన్. ఈమెకి కృష్ణ, మౌనిక, రేఖ, పర్వాన, రహిమా అనే పేర్లు కూడా ఉన్నాయి. 1990 నుండి 1995 వరకు బాలనటిగా, 2001 నుండి 2014 వరకు లీడ్ రోల్స్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో ఆర్టిస్ట్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, బిజీ లైఫ్ కొనసాగించింది. 2014 లో ముస్లిం మతం తీసుకుంది. తన పేరుని ఎంజి రహిమాగా మార్చుకుని ఇంకా సినిమాలు చేయనని సంచలన ప్రకటన చేసింది.

ఈమె భర్త మాలిక్ చెన్నైలో వ్యాపారవేత్త. ఎలక్ట్రానిక్ వస్తువులను దిగుమతి చేస్తూ ఉంటారు. మాలిక్ తండ్రి, మౌనిక తండ్రికి సన్నిహిత స్నేహం ఉంది. ఇద్దరి తండ్రుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో మౌనిక, మాలిక్ ల మధ్య స్నేహ బంధం ఏర్పడి అది కాస్త పెరిగి వీళ్ళద్దరు వివాహం చేసుకునే స్థాయికి వచ్చారు. తెలుగులో శివరామ రాజు , మా అల్లుడు వెరీగుడ్, కొడుకు, పైసాలో పరమాత్మ చిత్రాల్లో నటించిన మౌనిక పెళ్లి తర్వాత క్రెజ్ ఉండగానే సినిమాలకు బై చెప్పేసి , ఇంటికే పరిమితం అయ్యింది. అయితే హీరోయిన్ గా చేసిన సినిమాలు తక్కువే అయినా చాలా పేరు మాత్రం తెచ్చుకుంది.