MoviesTollywood news in telugu

పవిత్ర లోకేష్ రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా?

pavitra lokesh remuneration :హీరోయిన్ గా సక్సెస్ అయ్యాక పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి, కొన్నాళ్ల గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ తో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నదియా లాంటి వాళ్ళే కాకుండా హీరోయిన్ గా సక్సెస్ రాక, ఛాన్స్ లు రాక, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్మురేపుతున్న వాళ్ళూ ఉన్నారు.

ఈ రెండోకోవలోకి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వస్తుంది. ఇటీవలే తెలుగులో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన “రెడ్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన ఈమె హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించినప్పటికీ ఆ చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

దాంతో పవిత్ర లోకేష్ కొంతకాలం పాటు సినిమా ఛాన్స్ లు లేక ఉద్యోగం కూడా చేసింది. ఆ తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో నటిస్తూ బాగానే రాణిస్తోంది. అంతకుముందు చాలా సినిమాల్లో నటించిన పవిత్ర రెడ్ మూవీలో సిగరెట్ కాల్చుతూ మద్యం సేవించే అలవాటు ఉన్న మహిళ పాత్రలో నటించి, అందరినీ ఆశ్చర్యంలో పడేసింది.

ఇక ఈ రోల్ గురించి సోషల్ మీడియా లో తెగ వైరలవ్వడంతో ఆమె స్పందిస్తూ తాను కేవలం పాత్ర పరంగా అలా నటించానే అంతే తప్ప తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని క్లారిటీ ఇచ్చింది.పవిత్ర లోకేష్ స్వతహాగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటి అయినా తెలుగులోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది.

తెలుగులో సీనియర్ నుంచి జూనియర్ వరకు దాదాపు అందరి హీరోల చిత్రాల్లో అమ్మ పాత్రలలో నటించి, మెప్పించింది. ఇక ఈమె రెమ్యునరేషన్ గురించి కూడా పలు వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు చిత్రాలలో నటించేందుకు రోజుకి దాదాపు 50 వేల రూపాయల నుంచి లక్ష వరకూ తీసుకుంటుందని టాక్. ఒకవేళ అవుట్ డోర్ షూటింగ్ అయితే ప్రత్యేక విమానం టికెట్లు, హోటల్ గదులు చార్జీలు కూడా నిర్మాతలు భరించాలట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."