కార్తీక దీపం మౌనిత గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
karthika deepam serial monitha :సినిమాలతో సమానంగా టివి సీరియల్స్ కి ఆదరణ పెరగడంతో పలు వినోదాత్మక ఛానల్స్ లో వరుస సీరియల్స్ ధారావాహికంగా వస్తున్నాయి. వాటిల్లో కార్తీక దీపం.. సీరియల్ కి గల క్రేజ్ ఒక లెక్క, మిగతావన్నీ ఒకలెక్క అన్నట్లు ఉంటాయి. అంతగా ఈ సీరియల్ తెలుగు ఆడియన్స్ మదిని దోచింది. ఇందులో వంటలక్క పాత్ర లో నటించిన ప్రేమి అలాగే విలన్ పాత్ర చేసిన మోనిత కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అందుకే తనకు కార్తీక దీపం సీరియల్ చాలా ఇష్టమని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చిన మౌనిత ఈ సీరియల్ కి బెస్ట్ విలన్ అవార్డు కూడా అందుకుంది. వంటలక్కగా నటిస్తున్న ప్రేమి, తాను చాలా సన్నిహిత మిత్రులుగా చెప్పింది.
కర్ణాటకలోని బెంగళూరులోనే పుట్టి పెరిగిన మౌనిక అసలు పేరు శోభాశెట్టి. చదువులో కూడా టాప్ లోనే ఉంటూ, ఎంఎస్సి చేసింది. అయితే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై మక్కువ ఉండడంతో కన్నడలో కూడా ఆమె సీరియల్స్ లో నటించింది. కన్నడ లో ఆమె నటించిన సీరియల్ అగ్నిసాక్షి పేరుతొ తెలుగులో ప్రసారం అవుతోంది. ఇందులో మౌనిత హీరోయిన్ గా చేసింది. ఇందులో నటిస్తుండగా అంజలి పుత్ర అనే కన్నడ మూవీలో హీరో కి చెల్లెలిగా నటించే ఛాన్స్ రావడంతో సీరియల్ నుంచి తప్పుకుందట.
ఆ సినిమా పూర్తయ్యాక శోభా శెట్టి సీరియల్స్ లో రీ ఎంట్రీ ఇచ్చి, ఉదయ టివి లో ప్రసారం అయ్యే కావేరి సీరియల్ లో ఆమె హీరోయిన్ గా నటించి మెప్పించింది. కన్నడ సీరియల్స్ తెలుగులోకి కూడా డబ్బింగ్ కావడంతో తెలుగువారికి కూడా పరిచయం అయింది. అయితే తెలుగులో మొదటి స్ట్రైట్ సీరియల్ గా అష్టాచెమ్మాలో హీరోయిన్ గా చేసి, బెస్ట్ సీరియల్ యాక్టర్ అవార్డు అందుకుంది. ఆ తరువాత కార్తీకదీపంతో మౌనిత గా తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైంది. ఆమె నటిస్తున్న లాహిరి లాహిరి లాహిరిలో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

