MoviesTollywood news in telugu

ఈ వేసవిలో సందడి మామూలుగా లేదుగా…చాలా స్పెషల్

Chiranjeevi – Balakrishna – Nagarjuna – Venkatesh: :తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లుగా ఉంటూ ఇండస్ట్రీని ఏలాడమే కాదు, పెద్ద దిక్కుగా ఉండేవారు. ఇక ఇండస్ట్రీలో వచ్చే మార్పులకు అనుగుణంగా కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలు కూడా ఇండస్ట్రీని ఏలారు. ఇక తర్వాత కాలంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ నాలుగు స్థంభాలుగా ఇండస్ట్రీకి ఉంటూ మూడు దశాబ్దాలుగా తమ సత్తా చూపిస్తున్నారు. వీళ్ళ కి వయస్సు మీద పడినా ఏమాత్రం స్టామినా తగ్గలేదు. పైగా ఇందులో బాలయ్య, వెంకీ తప్ప మిగిలిన చిరు, నాగ్ ల వారసులు ఎంట్రీ ఇచ్చినా సరే, వీళ్ళ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

కరోనా సమయంలో ఇండస్ట్రీ కుదేలయింది.ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయి. సినిమాలు జోరుగా షూటింగ్ చేసుకుంటున్నాయి. ఇక ఈ సమ్మర్ సీజన్‌లో ఈ నలుగురు సీనియర్ హీరోల మూవీస్ రాబోతున్నాయి. వీళ్ళలో ఎప్రిల్ 2న వైల్డ్ డాగ్ మూవీతో అక్కినేని నాగార్జున ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. నిజానికి దర్శక నిర్మాతలు నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజ్ చేయాలనీ భావించి,తర్వాత అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని మరీ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు.

డైరెక్టర్ కొరటాల శివ ,మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తున్న ఆచార్య సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్ చరణ్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తుండ టంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా మే 13న విడుదల కానుంది. తమిళనాట సంచలన విజయం సాధించిన అసురన్ సినిమాకు రీమేక్ గా వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న నారప్ప మే 14న విడుదల కానుంది. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఓ క్రేజ్ ఉంది. తాజాగా బిబి 3 మే 28 ఎన్టీఆర్ జయంతి నాడు రిలీజ్ చేస్తారట.