MoviesTollywood news in telugu

శ్రీమంతుడు సీరియల్ నటి సత్య రియల్ లైఫ్…ఎలా ఉంటుందంటే…

Srimanthudu serial actress satya :ఇటీవల ఈటీవీలో నడుస్తున్న శ్రీమంతుడు సీరియల్ ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయింది. ఇందులోని నటీనటులు తమ నటనతో ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో నెగెటివ్ రోల్ చేస్తున్న సత్య తన అందంతో, అభినయంతో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈమె మోడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సత్య అసలు పేరు సౌమ్యరావు. 1992 సెప్టెంబర్29న కర్ణాటక రాష్ట్రంలో షిమోగా లో జన్మించిన ఈమెను ఇంట్లో ముద్దుగా సౌమ్య శారద అని కూడా పిలుస్తారు. షిమోగా గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ లో చదివిన ఈమె గ్రాడ్యుయేషన్ కువెన్ పూర్ యూనివర్సిటీలో పూర్తిచేసింది. శ్రీమంతుడు సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది.

వాస్తవానికి స్టడీస్ పూర్తయ్యాక న్యూస్ రీడర్ గా కన్నడ న్యూస్ ఛానల్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక నటనమీద మక్కువతో కన్నడ సీరియల్ తో నటనా రంగంలో అడుగుపెట్టింది. తల్లి, రోజా వంటి తమిళ సీరియల్స్ లో కూడా ఈమె నటించింది. ఈమె నటించిన తమిళ్ సీరియల్ ని మనసుమాట వినదు పేరిట తెలుగులో రీమేక్ చేసారు. అలాగే హిట్లర్ గారి పెళ్ళాం అనే డబ్బింగ్ సీరియల్ తో తెలుగులో రాణిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."