MoviesTollywood news in telugu

మోసగాళ్లు సినిమా ఎన్ని కోట్ల నష్టమో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Mosagallu Collections :ఇండస్ట్రీలో అనుభవం తో పాటు రిస్క్ కూడా ఉండాలి. అనుభవం పాఠాలు నేర్పినట్లే రిస్క్ కూడా పాఠం నేర్పిస్తుంది. సరిగ్గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విషయంలోనే కాదు, అతని కొడుకు మంచు విష్ణు విషయంలో కూడా ఈ రెండు నిజయమయ్యాయి. విష్ణు తాజాగా నటించిన మోసగాళ్లు సినిమా విడుదలైతే, కనీసం కోటి రూపాయల షేర్‌ కూడా రాలేదు. కేవలం రూ.70 లక్షలు మాత్రమే వసూళ్లు అయ్యిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదాపు 35 కోట్ల కు పైనే నష్టం వచ్చిందంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్.

నిజానికి 51 కోట్లతో నిర్మించిన మోసగాళ్లు మూవీని విడుదలకు ముందే నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా 12 కోట్లను దక్కించుకుంది. ఇక థియేట్రికల్‌ రైట్స్ ను సినిమా పై పెద్దగా అంచనాలు లేని కారణంగా 7 నుండి 10 కోట్లకు మాత్రమే విక్రయించారట. మొదట్లోనే ఈ మూవీ కథ విన్న మోహన్‌ బాబు కథ అద్బుతంగా ఉన్నా, బడ్జెట్‌ విషయంలో మాత్రం అంత రిస్క్ అవసరమా అంటూ హెచ్చరించాడు. ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్‌ సమయంలో మంచు విష్ణు వెల్లడించాడు.

నాన్న అలా చెప్పిన సమయంలో నేను మౌనంగా ఉండిపోయా. ఆతర్వాత నేను అనుకున్నట్లు భారీ బడ్జెట్ తో నిర్మించా అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. నాన్న గారు గతంలో ఎన్నో రిస్క్‌ లు చేశారు. ఆ రిస్క్ ల ముందు ఇదో చిన్న రిస్క్‌ అంతే అన్నట్లు భావించాను అని చెప్పాడు. అయితే రిస్క్‌ చేయకుండా ఉండటమే జీవితంలో అతి పెద్ద రిస్క్ అంటూ కొత్త వేదాంతం కూడా వల్లించడం గమనార్హం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."