MoviesTollywood news in telugu

స్టార్ కమెడియన్ కొడుకు హీరోగా ఎంట్రీ….ఎవరి కొడుకో చూడండి

comedian sudhakar son :బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ వారసత్వానికి కొదవలేదు. అన్ని స్థాయిల్లో వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే టాలెంట్ తో పాటు నసీబ్ ని బట్టి ఇండస్ట్రీలో ఉంటున్నారు. లేదంటే దూరమవుతున్నారు. ఇక ఒకప్పుడు తమిళంలో పలు సినిమాల్లో హీరోగా వెలుగొందాడు. అక్కడ సూపర్ స్టార్ అవుతున్న తరుణంలో చిరంజీవికి ఇక్కడ అవకాశం వచ్చింది. అయితే అక్కడ జరిగిన కొన్ని రాజకీయాల కారణంగా తమిళ ఇండస్ట్రీని సుధాకర్ వదిలేసి రావాల్సి వచ్చింది.

అప్పుడు తెలుగులో సినిమా ఛాన్స్ ల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ చెన్నైలో ఒకే రూమ్‌లో ఉండేవాళ్ళు. నిజానికి చిరంజీవి కంటే ముందు తమిళంలో 45 చిత్రాల్లో హీరోగా సుధాకర్ నటించడమే కాదు, రజనీకాంత్ కన్నా ముందే తమిళంలో స్టార్ హీరో అయ్యాడు కూడా. దేనికైనా అదృష్టం కూడా కల్సి రాకపోతే సీన్ రివర్స్ అవుతుందని సుధాకర్ విషయంలో నిజమైంది.

ఇక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా రాణించిన సుధాకర్ తెలుగులో చిరంజీవితో ‘యముడికి మొగుడు’ సినిమా నిర్మించి నిర్మాత, నటుడిగా నిలదొక్కుకున్నాడు. విలన్ గా, కమెడియన్ గా వందల సినిమాలు చేసి, కొన్నేళ్లుగా సుధాకర్ సినిమాలకు దూరం అయ్యాడు. దీనికి కారణం ఉంది. 2010లో అనారోగ్యానికి గురికావడం, దాంతో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో చాలా కాలం ఇంటికి పరిమితమయ్యాడు. అయితే సుధాకర్ కొడుకు ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. సుధాకర్ కొడుకు హీరోగానే కాకుండా ఎటువంటి పాత్రలు అయినా పోషించటానికి సిద్దంగా ఉన్నాడు. తండ్రి వలే మంచి పేరు తెచ్చుకోవాలని ఉందని ఒక ఇంటర్వ్యూ లో సుధాకర్ కొడుకు చెప్పాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."